Site icon NTV Telugu

Ram Charan: చరణ్ ట్వీట్ క్యాజువలా లేక ఇంటన్షనలా? #RRR2 రాబోతుందా?

Ram Charan

Ram Charan

ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియన్ సినిమా ప్రైడ్ గా ప్రపంచ దేశాలకి పరిచయం అయ్యింది. రాజమౌళి విజన్ ని నమ్మి రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటించి ఆర్ ఆర్ ఆర్ సినిమాని మరింత స్పెషల్ గా మార్చారు. నాటు నాటు పాట ఆస్కార్ గెలవడంతో రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. “ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా స్పెషల్ గా నిలిచిపోతుంది, ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు రాజమౌళికి థాంక్స్, నాటు నాటు పాట అందరినీ కలిపింది. చంద్రబోస్, కీరవాణి, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకి థాంక్స్” అంటూ లెటర్ ని రిలీజ్ చేసిన చరణ్… ఈ లెటర్ లో ఎన్టీఆర్ గురించి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ… “మై కో-స్టార్, బ్రదర్ తారక్… నీతో మళ్ళీ డాన్స్ చేసి రికార్డులని క్రియేట్ చెయ్యాలని ఉంది” అన్నాడు.

చరణ్ అన్న ఈ మాట క్యాజువలా లేక ఇంటన్షనలా అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న విషయం. ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్ 2’ ఉంటుంది అనే చెప్పేశాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుంది అని రాజమౌళి చెప్పాడు కాబట్టి రామ్ చరణ్ అన్న మాటలని లైట్ తీసుకోవడానికి లేదు. ఒకవేళ చరణ్-ఎన్టీఆర్-రాజమౌళిల కాంబినేషన్ లో ఆర్ ఆర్ ఆర్ 2 సినిమా అనౌన్స్ అయితే, చరణ-ఎన్టీఆర్ ల కాంబినేషన్ రిపీట్ అయితే వరల్డ్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం అయితే గ్యారెంటీ. ప్రస్తుతం రాజమౌళి, మహేశ్ బాబుతో సినిమా చేసే మూడ్ లో ఉన్నాడు కాబట్టి SSMB 29 ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఆర్ ఆర్ ఆర్ 2 గురించి అలోచిస్తాడేమో చూడాలి.

Exit mobile version