NTV Telugu Site icon

Raaja Saab : ‘రాజా సాబ్’ చెప్పిన టైమ్ కే వస్తాడా..?

Raajasaab

Raajasaab

పాన్ ఇండియా ప్రభాస్‌తో సినిమా చేయడానికి బడా బడా డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ సైతం ప్రభాస్‌తో సినిమాకు చేయడానికి ట్రై చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా కరోనా సమయంలో ప్రభాస్‌తో చర్చలు జరిపాడు. కానీ కుదరలేదు. అలాంటిది దర్శకుడు మారుతి మాత్రం ప్రభాస్‌తో జాక్ పాట్ కొట్టేశాడు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది.

Also Read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ క్రేజ్ మాములుగా లేదు.. కానీ ఫ్యాన్స్ ఫైర్

ఈ సినిమాతో వింటేజ్ డార్లింగ్‌ను చూపిస్తానని చెబుతున్నాడు మారుతి. అందుకు తగ్గట్టే ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్ అదిరిపోయాయి. అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అనేదే ఇప్పుడు అందరి డౌట్. 2025 ఏప్రిల్ 10న రాజాసాబ్‌ను రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు మేకర్స్. కానీ గ్రాఫిక్స్ వర్క్ డిలే కారణంగా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ ఉంది. అదే తేదీన స్టార్ బాయ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ నటిస్తున్న ‘జాక్’ మూవీని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయడం రాజాసాబ్ వాయిదాకు మరింత బలాన్నిచ్చింది. కానీ రీసెంట్‌గా రాజా సాబ్‌ షూటింగ్ పగలు, రాత్రి తేడా లేకుండా శరవేగంగా జరుగుతోంది, దాదాపు 80 శాతం పూర్తయింది, పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు.  రాజా సాబ్ టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది. కేవలం నాలుగు సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయట. అవి కూడా త్వరలో పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్‌కు పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. కాబట్టి రాజాసాబ్ వాయిదా పడే ఛాన్స్ లేదని అంటున్నారు.

Show comments