NTV Telugu Site icon

Nithiin : రాబిన్ హుడ్ ఇది సరిపోదు.. ఇంకా స్పీడ్ పెంచాలి

Nithiin

Nithiin

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం రాబిన్ హుడ్. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. గత కోనేళ్ళుగా నితిన్ హిట్ లేక సతమవుతున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తనకు భీష్మ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుములు నమ్ముకున్నాడు. స్టార్ హీరోల కోసం ప్రయత్నించి లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకీ కుడుముల స్ట్రాంగ్ హిట్ కొట్టి తానేంటో నిరూపించుకోవాలని ఉన్నాడు. మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న రాబిన్ హుడ్ పై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.

రిలీజ్ మరికొద్ది రోజులల్లో ఉండడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది యూనిట్. అందులో భాగంగా కాలేజీల సందర్శనకు బయలుదేరాడు నితిన్. స్టూడెంట్స్ కు ఈ సినిమాను మరింత దగ్గర చేసేందుకు వారతో ముచ్చటిస్తూ డాన్స్ లు వేస్తూ సినిమాపై చర్చ జరిగేలా చేస్తున్నాడు. అన్నీతానై సినిమాను మరింతపైగా ప్రేక్షకులకు దగ్గర చేసే పనిలో ఉన్నాడు. కానీ ఈ రాబిన్ హుడ్ సినిమాకు ఎందుకనో అనుకున్నంత బజ్ రావడం లేదు. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు ఓ గ్లిమ్స్, కొన్ని సాంగ్స్ రిలీజ్ చేసారు. కేతిక శర్మతో చేసిన అదిదా సర్ప్రైజ్ ఓ మోస్తరుగా హడావిడి చేసిన మిగిలిన సాంగ్స్ ఏవి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. థియేట్రికల్ ట్రైలర్ వచ్చి వెంకీ కుడుములు మార్క్ కామెడీ ఉంటే భారీ ఓపెనింగ్ రావడం అనేది కష్టమేమి కాదు. అలాగే రెగ్యులర్ ప్రమోషన్స్ కాకుండా సరికొత్త కాన్సెప్ట్స్ తో రావాలి. అప్పుడే ఆడియెన్స్ లో సినిమా రిజిస్టర్ అవుతుంది. GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది