Site icon NTV Telugu

Mirai : ‘మిరాయ్’ మరో కార్తికేయ-2 అవుతుందా..?

Mirai (1)

Mirai (1)

Mirai : ఈ నడుమ కథల్లో కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. రొటీన్ రొట్టకొట్టుడు లవ్ స్టోరీలు, యాక్షన్ సినిమాల జోలికి పోకుండా.. అటు నేటివిటీ కథలు.. లేదంటే జానపథ కథలు.. లేదంటే సోషియో ఫాంటసీ కథలను ఎంచుకుంటున్నారు. చాలా వరకు సోషియో ఫాంటసీ కథలు జనాలకు నచ్చుతున్నాయి. గతంలో వచ్చిన నిఖిల్ నటించిన కార్తికేయ-2 బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు యంగ్ హీరో తేజా సజ్జా కూడా ఇలాంటి సినిమానే చేస్తున్నాడు. అదే మిరాయ్. ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు వస్తున్నాయి. టీజర్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. అశోకుడి కాలంలోని తొమ్మిది గ్రంథాల ద్వారా వచ్చే దైవశక్తి.. వాటిని కాపాడటానికి పుట్టే జననం అనే కాన్సెప్టుతో తీస్తున్నారు.

Read Also : Jaishankar: ‘‘పాకిస్తాన్ దాడుల గురించి యూఎస్ హెచ్చరిక’’.. అందుకే భీకర దాడులు చేశాం..

బహుషా ఆ గ్రంథాలను కాపాడే వ్యక్తిగా తేజా సజ్జా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి.. ఫస్ట్ లుక్.. పోస్టర్లు అన్నీ ఆసక్తి రేపుతున్నాయి. తేజా గతంలో హనుమాన్ సినిమా చేయగా అది భారీ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని తన మేథస్సుకు పని పెడుతున్నాడు. మూవీ టీజర్ ను ఇప్పటికే చూసిన కొందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. పైగా ఇందులో మంచు మనోజ్ విలన్ గా చేస్తున్నాడు.

చూస్తుంటే కార్తికేయ-2కు దీనికి కొంచెం దగ్గరి పోలికలు ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో ఈ మూవీ కూడా కార్తికేయ-2 లాగానే భారీ హిట్ అవుతుందా అని తేజా సజ్జా ఫ్యాన్స్ అంటున్నారు. మూవీ పోస్టర్లు చూస్తుంటేనే హిట్ గ్యారెంటీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సోషియో ఫాంటసీ సినిమా చేసి భారీ హిట్ అందుకున్న తేజా.. ఈ మూవీతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Read Also : PM Modi: నుదిట సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశాం

Exit mobile version