NTV Telugu Site icon

The Kerala Story: ఎట్టకేలకు సాధించారు.. కేరళ స్టోరీ బ్యాన్..?

Kerala Story

Kerala Story

The Kerala Story: ది కేరళ స్టోరీ సినిమా చుట్టూ వివాదాలు ముసురుతూనే ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యినప్పటినుంచి సినిమాను నిలిపివేయాలంటూ కేరళ ప్రజలు, ప్రభుత్వం పోరాడుతూనే ఉన్నారు. 32 వేల మంది అమ్మాయిలు కనిపించకుండా పోయిన ఒక మిస్టరీ ఈ సినిమాలో ఉంది. మతమార్పిడి కోసం తీవ్రవాదులు ఎంత దిగజారి ప్రవర్తిస్తారు. మతం మార్చిన తరువాత ఆ యువతులను ఎలా సెక్స్ రాకెట్ లోకి దింపుతారు.. తీవ్రవాదులుగా ఎలా మారుస్తున్నారు..? అనేది కళ్ళకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్ సుదీప్తో సేన్. కేవలం టీజర్ రిలీజ్ చేసి మంట పుట్టించాడు. ఇక మంట అడవిని కాల్చేసింది. కేరళ ప్రభుత్వం సినిమాపై కళ్ళెర్ర జేసింది. సినిమను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అంతేనా సుప్రీం కోర్టు వరకు వెళ్లి.. స్టే కూడా తీసుకురావాలనుకుంది. అయితే రాజు తలుచుకుంటే.. దెబ్బలకు కొదువా అన్నట్లు.. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఈ సినిమాను ఆపడం ఒక లెక్క.

Ugram: అది.. కుర్ర హీరోలతో పెట్టుకుంటే మాములుగా ఉండదు.. ఇచ్చి పడేయడమే

ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం.. తమిళనాడు ప్రభుత్వం ది కేరళ స్టోరీని బ్యాన్ చేయడానికి అన్ని ఏరాట్లు చేసినట్లు తెలుస్తోంది. కేరళలో కనుక ఈ సినిమా రిలీజ్ అయితే.. అల్లర్లు జరగడం ఖాయం, ఇంకా గట్టిగా చెప్పాలంటే.. ప్రభుత్వంపై ప్రజల నమ్మకం కూడా పోతుందని చెప్పుకొస్తున్నారు. ఈ భయంతోనే కేరళ స్టోరీని బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. ఏదిఏమైనా అనుకున్నది సాధించారు.. ఏదైనా మీకు చెల్లుతుంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.