Site icon NTV Telugu

బన్నీ ‘స్పైడర్‌మ్యాన్’ని ఓడిస్తాడా!?

Pushpa-and-Spider-Man

బన్నీ ‘స్పైడర్‌మ్యాన్’ని ఓడిస్తాడా!?అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప: ది రైజ్’ ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే పాటలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాపై ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సెన్సార్ టాక్ తో ‘పుష్ప’ అన్ స్టాపబుల్ అని ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదలకు రెడీ అవుతున్నాడు ‘పుష్ప’.

ఇదిలా ఉంటే 17న ‘పుష్ప’ వస్తుంటే దానికి ఓ రోజు ముందుగా అంటే 16న హాలీవుడ్ మూవీ ‘స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్‌’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతోంది. అంటే బన్నీ ‘స్పైడర్ మేన్’తో బాక్సాఫీస్ యుద్ధం చేయబోతున్నాడన్నమాట. స్పైడర్‌మ్యాన్ ప్రపంచంలో అతిపెద్ద సినిమా ఫ్రాంచైజీలలో ఒకటి. మార్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్ తీస్తున్న ఈ సినిమాపై కూడా భారీ బజ్ ఉంది. పాండమిక్ తర్వాత వస్తున్న ‘నో వే హోమ్’ కు భారీ ఓపెనింగ్స్ ఖాయమని అంటున్నారు. బన్నీ ‘పుష్ప’కి తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఉంటే ‘స్పైడర్‌మ్యాన్’ దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘స్పైడర్ మేన్’కి దేశవ్యాప్తంగా బుకింగ్స్ అదిరిపోతున్నాయి.

Read Also : ఇప్పుడు దీపికా వంతు… డార్లింగ్ అదిరిపోయే ఆంధ్రా విందు

తెలుగులో ‘పుష్ప’ ప్రచారం బాగున్నా… ఇతర భాషల్లో మాత్రం అంతంత మాత్రమే. ఇప్పటికీ ఈ సినిమా వర్క్ జరుగుతూనే ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకుండా సుక్కు, దేవిశ్రీ ‘పుష్ప’కి మెరుగులు దిద్దటంలో బిజీగా ఉన్నారు. ఇంకా ఉన్నది మూడు రోజులు. ఈ టైమ్ లో ఏ యే నగరాల్లో ప్రచారం చేస్తారు? ఎలా చేస్తారు? అనే దానిపై ఆధారపడి ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రాజమౌళి పరభాషా ప్రచారం గురించి ఇన్ డైరెక్ట్ గా చెప్పటం గమనార్హం. తెలుగులోనూ ఇంకా ముఖాముఖి ఇంటర్వ్యూలు కాలేదు. బన్నీ తొలిసారి ఉత్తారాదిలో డైరెక్ట్ గా కాలుమోపుతున్నాడు కాబట్టి గట్టి ప్రచారం అవసరం. యు ట్యూబ్ డబ్బింగ్ సినిమాల ద్వారా ఉత్తరాది వారికి ఎంత పరిచయం ఉన్నప్పటికీ రిలీజ్ అవుతున్న సినిమా గురించి నేరుగా ఇంటరాక్ట్ అయినపుడే మరింత క్రేజ్ రాబట్టుకోగలడు. మరి ఈ విషయంలో బన్నీ ఎంత వరకూ సక్సెస్ అవుతాడన్నది వేచి చూడాల్సి ఉంది. అలా చేయగలిగినపుడే అల్లు అర్జున్ ‘స్పైడర్ మేన్’పై విజయం సాధించగలడు. అలా జరగాలని తెలుగువారిగా కోరుకుందాం!

Exit mobile version