అరుణ్ విజయ్ హీరోగా, హరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘యానై’. దీనిని తెలుగులో ‘ఏనుగు’ పేరుతో డబ్ చేశారు. ఆదివారం సాయంత్రమే హైదరాబాద్ లో ఈ సినిమా తెలుగు వర్షన్ ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు.
ఈ సినిమా ప్రచారం ఇలా మొదలు పెట్టారో లేదో అలా విడుదల వాయిదా పడిపోయింది. సోమవారం సాయంత్రం మూవీ నిర్మాతలు సాంకేతిక సమస్య కారణంగా ‘యానై’ సినిమాను ముందు అనుకున్నట్టు ఈ నెల 17న విడుదల చేయడం లేదని, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. సో…. ‘ఏనుగు’ రాక మరి కొంత ఆలస్యం అవుతోందన్న మాట!
