Comedian Ali: టాలీవుడ్ టాప్ కమెడియన్ ఆలీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్న విషయం విదితమే. ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం నవంబర్ 27 న గ్రాండ్ గా జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆలీ ఇంట పెళ్లి సందడి మొదలయ్యింది. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు, గవర్నర్ తమిళసైను ఆహ్వానించారు. వీరితో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ పెళ్ళికి తరలి రానుంది. ఇక నేడు చిరును కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందచేశారు ఆలీ దంపతులు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇప్పుడు అందరి మదిలోను మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న.. ఆలీ కుమార్తె పెళ్ళికి ప్రాణ స్నేహితుడు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించాడా..? లేదా..? అనేది.
బద్రి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతూనే వచ్చింది. అయితే మధ్యలో పవన్ పార్టీ పెట్టడం, ఆ పార్టీలో ఉండకుండా ఆలీ, వైసీపీలో చేరడం చకచకా జరిగిపోయాయి. ఎప్పుడైతే రాజీకీయాలు వీరిద్దరి మధ్యకు వచ్చాయో వీరి స్నేహం తెగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఆలీ కానీ, పవన్ కానీ ఎప్పుడు బయటకు చెప్పలేదు.. ఆలీ అయితే రాజకీయాలు వేరు, స్నేహం వేరు అని చెప్పుకొచ్చాడు. అన్ని బావుంటే పవన్ తో సినిమా కూడా చేస్తాను అని కూడా తెలిపాడు.
సరే ఇదంతా పక్కన పెడితే.. ఆలీ కుటుంబంలో జరుగుతున్న మొదటి అతి పెద్ద పండగ ఈ పెళ్లి. ఎంతో ఘనంగా ఆలీ కూతురు పెళ్లి చేస్తున్నాడు. మరి ఈ వేడుకలో ప్రాణ స్నేహితుడు లేకుండా ఎలా..? అందరిని పెళ్ళికి పిలుస్తున్నాడు.. మరి పవన్ వద్దకు ఆలీ వెళ్లి వివాహ పత్రిక ఇచ్చి ఆహ్వానించనున్నాడా..? అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. పెళ్ళికి రావాలి వద్దు అనేది పవన్ నిర్ణయం.. కానీ పిలవాల్సిన బాధ్యత మాత్రం ఆలీదే అంటున్నారు నెటిజన్లు. ఇక ఇటీవలే ఆలీని.. ఎలక్రానిక్ మీడియా అడ్వైజర్ గా జగన్ నియమించారు. ఈ సమయంలో ఆలీ, పవన్ పిలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది అందరికి తెల్సిన విషయమే. ఈ పరిస్థితిలో ఆలీ స్నేహం కోసం పవన్ ను పిలుస్తాడా..? పార్టీ కోసం ఆగుతాడా..? అనేది చూడాలి.