2022 అక్కినేని ఫ్యామిలీకి అంతగా కలిసి రాలేదు. ఈ ఇయర్ నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ సినిమా సినీ అభిమానులని డిజప్పాయింట్ చేసింది. నాగ చైతన్య కూడా 2022లో మూడు సినిమాలని రిలీజ్ చేశాడు, వీటిలో ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చడ్డా'(గెస్ట్ పెర్ఫార్మెన్స్) సినిమాలో బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని రాబట్టలేకపోయాయి. నాగార్జున, చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమా మాత్రమే 2022లో అక్కినేని ఫ్యామిలీకి దక్కిన హిట్. డిజప్పాయింట్ చేసిన 2022 నుంచి బయటకి వచ్చి 2023ని గ్రాండ్ గా స్టార్ట్ చెయ్యాలనేది అక్కినేని హీరోల ప్లాన్. నాగ చైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటివలే రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని సొంతం చేసుకుంది. అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఏకంగా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ పై అక్కినేని అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి.
Read Also: Kushi Re Release Trailer: నటించకు.. నువ్వు నా నడుము చూసావ్..
ఏజెంట్ టీజర్ కూడా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని అమాంతం పెంచేసింది. సంక్రాంతికే ‘ఏజెంట్’ సినిమా రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ అనివార్య కారణాల వాళ్ల ఈ సినిమా రిలీజ్ డిలే అయ్యింది. తాజా సమాచారం ప్రకారం అఖిల్ ‘ఏజెంట్’ సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేశారని, జనవరి 1వ తేదిన రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ డేట్ తో పాటు ఒక కొత్త పోస్టర్ ని కూడా మేకర్స్ విడుదల చేయ్యనున్నారట. నాగ చైతన్య నటిస్తున్న ‘కస్టడీ’ సినిమా నుంచి కూడా జనవరి 1న కొత్త పోస్టర్ మరియు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వస్తుందని సమాచారం. ఈ రెండు సినిమాలు దాదాపు మార్చ్ నెలలోనే ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. మరి 2022 ఇచ్చిన బాడ్ మెమోరీస్ ని పూర్తిగా చెరిపేసి 2023లో ఈ అక్కినేని బ్రదర్స్ సాలిడ్ హిట్ కొడతారేమో చూడాలి.
Read Also: Honey Rose: ఈ హీరోయిన్ ఆల్రెడీ ఒక తెలుగు సినిమాలో నటించిందని మీకు తెలుసా?
