NTV Telugu Site icon

AA 23 : ప్రభాస్ ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్

AA 23(3)

AA 23

బాహుబలితో టాలీవుడ్ సత్తా ఏంటో డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్‌కు రుచి చూపిస్తే, పుష్ప సిరీస్ చిత్రాలతో నార్త్ బెల్ట్ షేక్ ఆడించేశాడు పుష్ప రాజ్ అలియాస్ అల్లు అర్జున్. ప్రజెంట్ టాలీవుడ్‌లో సోలో హీరోలుగా వెయ్యి కోట్ల మార్క్ చూసిన ఇద్దరు మొనగాళ్లుగా మారిపోయారు ప్రభాస్ అండ్ బన్నీ. కానీ బాహుబలి తర్వాత రాజమౌళి ఎఫెక్ట్ వల్ల కావొచ్చు కథల ఎంపికలో తడబాటు కావొచ్చు యంగ్ రెబల్ స్టార్ నెక్ట్స్ పిక్చర్స్ బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టాయి. సాహో తెలుగులో సోసో అనిపించినా నార్త్ బెల్ట్‌లో రప్ఫాడించింది.

Also Read : Ruhani Sharma : పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న రుహాణి లేటెస్ట్ ఫొటోస్

సాహో తర్వాత వచ్చిన రాధే శ్యామ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో జస్ట్ ఫర్ ఛేంజ్ అంటూ మైథాలజీ మూవీ ఆదిపురుష్ చేశాడు. ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ కాలేదు కానీ దర్శకుడు ఓం రౌత్‌, మాటల రచయితపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే బాగా హర్ట్ అయ్యారు. కానీ ఆ లెక్కలన్నీ సరిచేశాడు సలార్‌తో ప్రభాస్. ఆరడుగుల మాస్ కటౌట్ చూసి పొంగిపోయారు. ఇక కల్కి ఎటువంటి మార్క్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. కాగా, ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్‌ను ఫాలో అవుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

Also Read :   Vikram : చివరి నిమిషంలో ‘వీర ధీర సూరన్’ విడుదల వాయిదా.?

పుష్ప 2 ఇచ్చిన హిట్ ఎంజాయ్ చేసిన బన్నీ అట్లీతో చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్టు కోసం ప్రిపేరవుతున్నాడు. కాగా, ఈ సినిమా కంప్లీట్ కాగానే త్రివిక్రమ్‌తో సినిమాకు షిఫ్ట్ అవుతాడు. అయితే ఈసారి బన్నీతో సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ కాంబోలో మైథాలజీ మూవీ ఉండబోతుండట. ఈ విషయాన్ని రీసెంట్లీ ప్రముఖ నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. డిఫరెంట్ మైథాలజీ స్టోరీని తీసుకురాబోతున్నారట. పురాణాల్లో ఎక్కువగా ఎస్టాబ్లీష్ కానీ ఓ గాడ్ లైఫ్ స్టోరీని తెరకెక్కించబోతున్నారట. భారీగా తీయబోతున్నట్లు చెప్పాడు నాగవంశీ. ఆదిపురుష్ రిజల్ట్ చూసిన మాటల మాంత్రికుడు ఓ లెసన్‌గా భావించి తన కలానికి మరింత పదును పెట్టి మైథాలజీ అంటూ టాలీవుడ్డే తీయాలా అని ఫ్రూవ్ చేస్తాడేమో చూడాలి.