LEO: లోకేష్ యూనివర్స్ లో చరణ్ ఉన్నాడా? కాశ్మీర్ లో ఏపీ కార్లు ఎందుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మూవీ ‘లియో’. మాస్టర్ సినిమాతో బాలన్స్ ఉన్న హిట్ ని ఈసారి పాన్ ఇండియా లెవల్లో అందుకోవడానికి విజయ్, లోకేష్ లు రెడీ అయ్యారు. రీసెంట్ గా గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో జరుగుతోంది. గతంలో ఒక షెడ్యూల్ జరిగింది కానీ అది ప్రోమోకి మాత్రమే వాడారు. టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన వీడియోలో విజయ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ షాట్స్ డిసెంబర్ లో షూట్ చేసినవే. కాశ్మీర్ లో విజయ్ బిల్డింగ్ ఎక్స్టీరియర్, కార్ల పాసింగ్ షాట్స్ ని తీసుకోని అనౌన్స్మెంట్ వీడియోని రెడీ చేశారు. ఇందులో విజయ్ కోసం వచ్చే కార్స్ లో ఒక కార్ కి ఏపీ రిజిస్ట్రేషన్ ఉంది. ఇది చూడగానే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి రామ్ చరణ్ వస్తున్నాడు, అందుకే ఏపీ కార్లు కాశ్మీర్ లో కనిపించాయి లేదంటే లోకేష్ అంత ఈజీగా ఏపీ నంబర్ ప్లేట్ ఉన్న కారుని రిజిస్టర్ చెయ్యడు అంటూ ఎవరి థియరీలు వాళ్లు చెప్తున్నారు.
ఇందులో ఎంతవరకూ నిజం ఉంది అనే విషయం ఎవరికీ తెలియదు కానీ లోకేష్ కి కూడా లేని ఐడియాలని అభిమానులు ఇస్తున్నట్లు ఉన్నారు. చరణ్, లోకేష్ కలిసి ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. అది లియోలో గెస్ట్ రోల్ తో ఎస్టాబ్లిష్ చేస్తాడా? లేక తర్వాత ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తాడా అనేది తెలియదు. ఒకవేళ అందరూ అనుకుంటున్నట్లు చరణ్, LCUలో జాయిన్ అయితే ఆ హైప్ భారీగా ఉంటుంది. విక్రమ్ మూవీలో రోలెక్స్ పాత్ర కోసం సూర్యని దించి లోకేష్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ ఇంపాక్ట్ కి వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది, చరణ్-విజయ్ లు లియో మూవీలో ఎదురు పడితే. మరి లియోలో చరణ్ కనిపించడం అనే థియరీకి అయితే లోకేష్ మాత్రమే సమాధానం చెప్పగలడు. అప్పటివరకూ వెయిట్ చెయ్యాల్సిందే.
Also Read
- Ajay Bhupathi: "శ్రీనివాస మంగాపురం" ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
- Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..