Pawan Kalyan: పవన్ మూడు పెళ్లిళ్లపై వర్మ సినిమా.. అందుకే జగన్ ను కలిశాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా అందులో వివాదం ఉండాల్సిందే. చేసే సినిమా అయినా, మాట్లాడే మాట అయినా వివాదం లేకపోతే ఆయనకు ముద్ద దిగదు. ఇక వర్మ సినిమాలు అంటే.. ఒకప్పుడు సాలిడ్ యాక్షన్ హిట్స్ అనేవారు ఇపుడు చెత్త సినిమాలు అంటూ పెదవి విరుస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో రాజకీయ నేతల బయోపిక్స్ తో రచ్చ చేసినా వర్మకు మాత్రం ఒక రూపాయి వచ్చింది లేదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజాగా వర్మ మరో సంచలనానికి తెరతీస్తునట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం నేడు వర్మ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కావడమే. సడెన్ గా జగన్ తో మీటింగ్ ఏంటీ..? ఎందుకు..? అని ప్రతి ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడు గంటల జరిగిన ఈ మీటింగ్ లో సినిమాల గురించే వర్మ చర్చించినట్లు తెలుస్తోంది.
ఇక గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయం ఎంతటి రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నవాడు రాజకీయాలకు పనికిరాడని, భార్యలనే సరిగ్గా చూసుకోలేనివాడు రాష్ట్రాన్ని ఎలా చూసుకుంటాడని ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక ఇటీవలే మంగళగిరి మీటింగ్ లో ఆ విమర్శలకు పవన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. మునెప్పుడు లేనివిధంగా పవన్ కోపాన్ని చూశారు ప్రజలు. ఇక ఇదంతా స్టోరీగా చేసుకొని వర్మ సినిమాగా తీయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి, అందుకే వర్మ, జగన్ ను కలిసి ఈ స్టోరీని వినిపించాడట. ఇప్పటికే పవన్ పై వర్మ రెండు సినిమాలు తీశాడు. ఇక ఎన్నికల సమయంలో పవన్ ను టార్గెట్ చేయడానికి వర్మ ఇలాంటి ప్లాన్ వేసినట్లు జనసేన అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరిఇందులో ఎంత నిజం ఉన్నది అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- Drishyam 3 : మోహన్ లాల్ ఖాతాలో మరో రికార్డ్.. జస్ట్ 7 రోజుల్లో సెన్సేషన్
- Suriya : ఆగస్టు 14న 'విశ్వనాథ్ అండ్ సన్స్' రిలీజ్ ఫిక్స్
- Obsession : 0.75 మిలియన్ డాలర్లతో సినిమా తీసిన యూట్యూబర్.. కలెక్షన్ల వర్షం కురిపించిన ఆడియన్స్
- NTR : తెలుగువారి ఆత్మగౌరవం.. అఖండ తెలుగు జాతి కీర్తి పతాకం.. 'ఎన్టీఆర్' 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి!
తాజావార్తలు
-
Siddaramaiah: కర్ణాటకలో పవర్ ఛేంజ్.. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా
-
DK Shivakumar: వందల కోట్ల షాపింగ్ మాల్, కోట్ల సంపద.. కర్ణాటక కొత్త సీఎం వైభవం..
-
Motkupalli Narasimhulu: ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకుంటూ మోత్కుపల్లి భావోద్వేగం.. “మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేం”
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Vaibhav Suryavanshi: అన్బిలీవబుల్ ప్లేయర్.. వండర్ కిడ్.. పవర్ బ్యాటింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్!
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..