రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా, ఇండిపెండెన్స్ స్పెషల్‌గా ఆగస్ట్ 14న విడుదలైన “కూలీ” భారీ అంచనాలతో పాన్-ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్ లెవెల్లోనే మాస్ బజ్ ఆకాశాన్ని తాకినా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ మిరాకిల్ కనిపించలేదు. యాక్షన్ స్టైలిష్‌గా ఉన్నా రజనీకాంత్‌కి తగిన ఎమోషన్, ఎలివేషన్ తగ్గిపోయింది అన్న కామెంట్స్ వచ్చాయి. లాజిక్కు అందని కథనాలు, రజినీకి హాల్‌మార్క్ అయిన పంచ్ డైలాగ్స్ మిస్సింగ్ అవ్వడం ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది. మోనికా సాంగ్, మలయాళ స్టార్ సౌబిన్ సాహిర్, కన్నడ నటి రక్షిత రామ్ నటన మాత్రమే ఆకట్టుకున్నా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ హిట్ సాదించలేక పోయింది. లోకేష్ కనగారాజ్ యూనివర్స్ లో గత మూడు సినిమాలు కల్ట్‌గా నిలిచినా “కూలీ” మాత్రం ఆడియన్స్‌ను డిసప్పాయింట్ చేసింది. కోలీవుడ్ డ్రీమ్ అయిన రూ. 1000 కోట్ల క్లబ్ మరోసారి కలగానే మిగిలిపోగా “దాన్ని ఎవరు రీచ్ అవుతారు” అనే సస్పెన్స్‌తో ఆడియన్స్ మళ్లీ సెర్చ్ మొదలు పెట్టారు.
Also Read : Coolie 4 days box office collections : కూలీ 4 డేస్ కలెక్షన్స్.. ఇంకా చాలా రావాలి
2019లో లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన “ఖైదీ” – కార్తీ కెరీర్‌లో ఓ మాస్టర్ స్ట్రోక్‌గా నిలిచింది. హీరోయిన్ లేని సినిమా పాటలు లేని సినిమా కేవలం ఒక రాత్రి జరిగే కథ మాత్రమే. జైలు నుంచి బయటకొచ్చిన ఖైదీ, తన కూతురిని కలిసే ప్రయాణంలో పోలీస్,డ్రగ్ మాఫియా మధ్య చిక్కుకున్నాడు. యాక్షన్, ఎమోషన్, రియలిజం మేళవించి… సౌత్ సినిమాల్లో కొత్త టెంప్లేట్ సెట్ చేసింది. క్రిటిక్స్ మరియు ఆడియన్స్ ఇద్దరికీ నచ్చిన ఈ క్రేజీ హిట్ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 2022లో వచ్చిన “విక్రమ్” కమల్ హాసన్ కెరీర్ రీఎంట్రీకి రారాజుగా నిలిచింది. బ్లడీ స్వోర్డ్ ఫైట్స్‌తో మాస్ జనం మంత్ర ముగ్ధులయ్యారు. ఫహద్ ఫాసిల్ అండర్‌కవర్ పోలీస్ పాత్రలో అదరగొట్టగా విజయ్ సేతుపతి మాఫియా డాన్‌గా కొత్త లెవెల్ చూపించాడు. ఆఖరులో సూర్య రోలెక్స్ ఎంట్రీ – లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ మీద ఆడియన్స్ హైప్ రెట్టింపు చేసింది. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత లోకేష్ – ‘మాస్ డైరెక్టర్’ నుంచి “మాస్టర్ మైండ్ ఆఫ్ LCU” స్థాయికి ఎదిగాడు. ఇకపోతే 90లలో వచ్చిన అసలు “విక్రమ్” (1986) కి ఆధునిక వెర్షన్‌గా ఈ సినిమా నిలిచింది అన్న కామెంట్స్ వినిపించాయి . మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ – ఫైట్ సీన్స్‌కి అదనపు ఆకర్షణ గా నిల్చింది.
Also Read : Suriya64 : వెంకీ అట్లూరి – సూర్య ‘టైటిల్’ ఇదే
2023లో వచ్చిన “లియో” విజయ్‌ని డబుల్ షేడ్‌లో చూపించిన సెన్సేషన్ మూవీ. చిన్న పట్టణంలో బేకరీ వాడిలా ఉండే విజయ్ పాస్ట్ లో క్రూరమైన మాఫియా కనెక్షన్. ‘నా రెడీ’ సాంగ్ నుంచి ఇంటర్వెల్ ఫైట్ వరకు థియేటర్లు షేక్ అయ్యాయి. కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లే స్లో అనిపించినా ఫ్యామిలీ ఎమోషన్ + మాస్ ఫైట్స్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేశాయి. చివర్లో విక్రమ్ యూనివర్స్ కనెక్ట్ క్లియర్ అవ్వడం మరింత హైప్ క్రియేట్ చేసింది. మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రసిద్ధ హాలీవుడ్ సినిమా ‘ఎ హిస్టరీ ఆఫ్ వైలెన్స్’ కి రిఫరెన్స్‌గా ఈ కథ రాసినట్టుగా డిస్కషన్ జరిగింది. ఇకపోతే అనిరుధ్ మ్యూజిక్, విజయ్ స్టార్డమ్, లోకేష్ బ్రాండింగ్ కలిపి సినిమా రేంజ్ ని మరింతగా లిఫ్ట్ చేశాయి. ఖైదీ, విక్రమ్, లియో – ఈ మూడు సినిమాలు ఆడియన్స్‌తో పర్ఫెక్ట్‌గా కనెక్ట్ అయినా, కూలీ మాస్ ఆడియన్స్‌ను సంతృప్తి పరచలేకపోయింది. అందుకు కథే ప్రధాన లోపం. అంత మంది స్టార్స్ ఉంటె చేసేస్తారులే అనుకుని పేలవమైన కథ, కథనాలలతో తెరకెక్కించారు. ఎంత మంది స్టార్స్ ఉన్నా సరే అల్టిమేట్ కథే. అది లేకుంటే ఎందరు స్టార్స్ ఉన్నా కూడా ఎందుకు ఉపయోగం ఉండదు. కూలీ కలెక్షన్స్ రాబట్టొచ్చు గాక కానీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కెరీర్ లో వీకెస్ట్ రైటింగ్ అంటే కూలీ అనే చెప్పాలి. ఆడియెన్స్ ను గ్రాంటెడ్ గా తీసుకుని కూలీని మలిచిన విధానం ఏ మాత్రం ఆమోదయోగ్య కాదు.