Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమణులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా కూడా మేకర్స్ షూటింగ్ ను ఫినిష్ చేయలేదని టాక్ నడుస్తోంది. ఇక ఈ మధ్యనే సర్జరీ ముగించుకొని అమెరికా నుంచి ఇండియా వచ్చిన ప్రభాస్ రెస్ట్ మోడ్ లో ఉన్నాడని తెలుస్తోంది. ఒక పక్క సలార్ చేస్తూనే.. ఇంకోపక్క మారుతీ సినిమాను పూర్తిచేస్తున్నాడు ప్రభాస్. ఇక ఈరోజు తెలంగాణ ఎలక్షన్స్ అన్న విషయం తెల్సిందే. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు.. తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకొని వచ్చారు. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ముగిసింది.
Director Teja: ఓటు వేయని వారు దేశద్రోహులు.. జూబ్లీహిల్స్ లో ఎక్కువ ఉన్నారు
ఉదయం నుంచి కూడా ప్రతి సెలబ్రిటీ .. తమ ఓటును వినియోగించుకొని.. దాని విలువ గురించి చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గరనుంచి కుర్ర హీరో నిఖిల్ వరకు అందరూ తమ ఓటుహక్కును వినియోగించుకున్న్నారు. కానీ, ప్రభాస్ మాత్రం.. ఓటు వేయడానికి కూడా రాలేదు. అయితే ప్రభాద్ ఎక్కడ ఉన్నాడు అనేది కూడా సమాచారం లేదు. సలార్ షూటింగ్ లో ఉన్నాడా.. ? లేక రెస్ట్ మోడ్ లో ఉన్నాడా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఓటు కోసం ఎంతో మంది సెలబ్రిటీలు షూటింగ్ మానుకొని మరీ వచ్చారు. మరి ప్రభాస్ ఎందుకు రాలేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక పోలింగ్ బూత్ ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్.. డార్లింగ్ వస్తాడని ఎంతగానో ఎదురుచూసారు.. కానీ, డార్లింగ్ రాకపోయేసరికి వాళ్లు నిరాశపడుతున్నారు.
