Site icon NTV Telugu

సామ్ టీ షర్ట్ ధర, దానిపై ఉన్న వర్డ్స్ రెండూ షాకింగ్!!

Samantha

సౌత్ స్టార్ సామ్ తాజాగా ముంబైలో దర్శనమిచ్చింది. అక్కడ ఓ సెలూన్‌లో నుంచి బయటకు వస్తున్న సామ్ ను కెమెరాలో బంధించారు. సమంత పర్ఫెక్ట్‌ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్యాజువల్ లుక్ లో టీ-షర్టుపై ప్రత్యేక సందేశంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ పిక్ లో సామ్ ధరించిన షర్ట్ విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే ఆ షర్ట్ దాదాపు ఒక సామాన్యుడి నెల జీతం… అంటే రూ. 17,000 విలువైన R13 వైట్ షర్ట్ ధరించింది. వైట్ రిప్డ్ టీతో జత చేసిన బేసిక్ బ్లాక్ జీన్స్ ధరించి సూపర్ కూల్ గా కనిపించింది. తెల్లటి స్పోర్ట్స్ షూలు ధరించి, మాస్క్ కూడా పెట్టుకుంది. మరి సెలెబ్రిటీ అన్నాక కాస్ట్లీ దుస్తులు ధరించడం సాధారణమే కదా !

Read Also : ఐశ్వర్య ధనుష్ కు కరోనా పాజిటివ్

కాగా 2021లో సమంతా చాలాసార్లు వార్తల్లో నిలిచింది. మొదట వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2, ఆమె బాలీవుడ్ అరంగేట్రం, తర్వాత ‘పుష్ప : ది రైజ్’లోని ఆమె పాట ‘ఊ అంటావా’తో సంచలనం సృష్టించింది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. జాన్ ఫిలిప్స్‌తో కలిసి ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ చేయడంతో పాటు సమంతా తన హిందీ సినిమా కూడా చేసే అవకాశం ఉంది. మరోవైపు విఘ్నేష్ శివన్ ‘కాతు వాకులా రెండు కాదల్‌’లో సమంత కనిపించనుంది. విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి, నయనతార కూడా ఇందులో నటించారు. గుణశేఖర్ పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

Exit mobile version