Daggubati Family: అన్న ‘పరేషాన్’, తమ్ముడు ‘అహింస’… ఏంటో పరిస్థితి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో దగ్గుబాటి బ్రదర్స్ నుంచి రెండు సినిమాలు రావడం విశేషం. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన రానా, ఆల్రెడీ పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకోగా… రానా తమ్ముడు అభిరాం ‘అహింస’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అహింస’ చాలా వాయిదాల తర్వాత జూన్ 2 ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమాని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కిరణ్ నిర్మించాడు. గీతికా హీరోయిన్‌గా నటించింది. చాలా కాలం తర్వాత ఆర్ పి పట్నాయక్, తేజ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో.. అహింస పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాతో నటుడిగా అభిరాం ఎలా ఆకట్టుకుంటాడనే ఆసక్తి అందరిలోను నెలకొంది. తేజ హీరోలుగా లాంచ్ చేసిన ఉదయ్ కిరణ్, నితిన్ లాంటి వారు మంచి స్టార్ డమ్ అందుకున్నారు కాబట్టి అభిరామ్ కూడా అందరి అంచనాలు అందుకుంటాడనే నమ్మకం ఉంది. అన్ని సెంటర్స్ లో మార్నింగ్ షోస్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు ట్విట్టర్ లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలో నిలబడిపోయినట్టేనని అంటున్నారు. అయితే ఇదే రోజు.. తిరువీర్ హీరోగా రూపొందిన పక్కా తెలంగాణ విలేజ్ డ్రామా ‘పరేషాన్’ మూవీ థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పించాడు. తమ్ముడి సినిమాతో పాటు.. పరేషాన్ మూవీని కూడా గట్టిగానే ప్రమోట్ చేశాడు రానా. అయితే చివరగా విరాట పర్వం సినిమాతో మెప్పించలేకపోయనా రానా… ప్రజెంటర్‌గా అయినా సక్సెస్ అవుతాడా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ సినిమా నిజంగానే థియేటర్లో పరేషాన్ చేసేలా ఉందని అంటున్నారు. విలేజ్ నేటివిటీ ఉన్న సినిమా మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఆడుతుంది అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా దగ్గుబాటి అన్నదమ్ముల్లో ఎవరిది అప్పర్ హ్యాండ్ అనేది ఆసక్తికరంగా మారింది. అది తెలియాలంటే ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!