NTV Telugu Site icon

Daggubati Family: అన్న ‘పరేషాన్’, తమ్ముడు ‘అహింస’… ఏంటో పరిస్థితి?

Daggubati Family

Daggubati Family

ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో దగ్గుబాటి బ్రదర్స్ నుంచి రెండు సినిమాలు రావడం విశేషం. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన రానా, ఆల్రెడీ పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకోగా… రానా తమ్ముడు అభిరాం ‘అహింస’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అహింస’ చాలా వాయిదాల తర్వాత జూన్ 2 ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమాని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కిరణ్ నిర్మించాడు. గీతికా హీరోయిన్‌గా నటించింది. చాలా కాలం తర్వాత ఆర్ పి పట్నాయక్, తేజ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో.. అహింస పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాతో నటుడిగా అభిరాం ఎలా ఆకట్టుకుంటాడనే ఆసక్తి అందరిలోను నెలకొంది. తేజ హీరోలుగా లాంచ్ చేసిన ఉదయ్ కిరణ్, నితిన్ లాంటి వారు మంచి స్టార్ డమ్‌ అందుకున్నారు కాబట్టి అభిరామ్ కూడా అందరి అంచనాలు అందుకుంటాడనే నమ్మకం ఉంది. అన్ని సెంటర్స్ లో మార్నింగ్ షోస్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు ట్విట్టర్ లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలో నిలబడిపోయినట్టేనని అంటున్నారు. అయితే ఇదే రోజు.. తిరువీర్ హీరోగా రూపొందిన పక్కా తెలంగాణ విలేజ్ డ్రామా ‘పరేషాన్’ మూవీ థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పించాడు. తమ్ముడి సినిమాతో పాటు.. పరేషాన్ మూవీని కూడా గట్టిగానే ప్రమోట్ చేశాడు రానా. అయితే చివరగా విరాట పర్వం సినిమాతో మెప్పించలేకపోయనా రానా… ప్రజెంటర్‌గా అయినా సక్సెస్ అవుతాడా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ సినిమా నిజంగానే థియేటర్లో పరేషాన్ చేసేలా ఉందని అంటున్నారు. విలేజ్ నేటివిటీ ఉన్న సినిమా మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఆడుతుంది అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా ద‌గ్గుబాటి అన్న‌ద‌మ్ముల్లో ఎవరిది అప్పర్ హ్యాండ్ అనేది ఆసక్తికరంగా మారింది. అది తెలియాలంటే ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే

Show comments