గుంటూరు కారం తర్వాత రాజమౌళి చేతికి చిక్కిపోయాడు మహేష్ బాబు. వారణాసిని సంథింగ్ బిగ్ కుక్ చేస్తున్నాడు జక్కన్న. బాహుబలి, త్రిబుల్ ఆర్ కన్నా.. మరింత విసృత్తంగా పాన్ వరల్డ్‌కు తీసుకెళ్లబోతున్నాడు. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయని మహేష్ బాబు.. వారణాసితో ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లబోతున్నాడు. నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మైథాలజికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్.
ఇంకొన్ని రోజుల్లో వారణాసి షూట్ కంప్లీట్ కావొస్తుండటంతో మహేష్ బాబు నెక్ట్స్ ఎవరితో అనే డిస్కర్షన్ టీఎఫ్ఐలో షురూ అయ్యింది. పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుతో మైథాలాజికల్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చాడు. టైమ్ నిర్ణయిస్తుందని రిప్లై ఇచ్చాడు బుచ్చి. అయితే పెద్ది మిక్స్డ్ టాక్ రావడంతో బుచ్చికి సూపర్ స్టార్ ఛాన్స్ ఇస్తాడా అనేది డౌటే. బుచ్చిబాబు కన్నా ముందుగా మహేష్ బాబుతో సినిమా ప్లాన్ చేసుకుని సెట్ కాకపోవడంతో ఆగిపోయాడు సందీప్ రెడ్డి వంగా. యానిమల్ కన్నా ముందే డెవిల్ కథను సిద్ధం చేసుకుని మహీకి వినిపించాడు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. అయితే త్వరలో ఈ కాంబో సెట్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. గతంలో కూడా పలు ఇంటర్వ్యూలో మహేష్‌తో సినిమా చేస్తానని చెప్పాడు డైనమిక్ డైరెక్టర్. ప్రస్తుతం స్పిరిట్‌తో బిజీగా ఉన్న సందీప్.. ఈ మూవీ ఫినీష్ చేయగానే మహేష్ 30వ మూవీని డీల్ చేస్తాడన్న బజ్ నడుస్తోంది. అంతలో మహేష్ బాబు అనిల్ రావిపూడితో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఇంకో న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. మరీ మహేష్ బాబు ఎవరికి ఛాన్స్ ఇస్తాడో..? ఎవరితో చేసినా.. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది.

