NTV Telugu Site icon

Mahesh Babu: జక్కన్న గండం దాటించే ధీరుడు ఎవరు?

Mahesh Babu

Mahesh Babu

రాజమౌళి, మహేష్ బాబు కాంబో అంటే ఆ లెక్క మామూలుగా ఉండదు. దాదాపు పదేళ్లుగా ఈ కాంబో డిలే అవుతూనే ఉంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్‌తో రాబోతున్నారు మహేష్, రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన రికార్డులు, అవార్డుల రచ్చకి SSMB 29 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పేశాడు జక్కన్న. ఈ ప్రాజెక్ట్ దాదాపుగా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. ఈ లెక్కన మహేష్ బాక్సాఫీస్ టార్గెట్ 2500 కోట్లకు పైగా ఉంటుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఈ సినిమాతో మహేష్ బాబుకి కూడా గ్లోబల్ రీచ్ రావడం, మహేహ్స్ బాబు అనే బ్రాండ్ ప్రపంచానికి పరిచయం అవ్వడం గ్యారెంటీ. ఖచ్చితంగా ఇప్పటివరకూ ఉన్న మహేష్ బాబు బాక్సాఫీస్ లెక్కలన్నీ మార్చేయనున్నాడు రాజమౌళి. ఇంటర్నేషనల్ స్పేస్ లో, ఇండియానా జోన్స్ రెంజులో SSMB 29ని జక్కన్న ప్రాజెక్ట్ చేస్తాడు.

మరి ఇలాంటి ఇంటర్నేషనల్ సినిమా తర్వాత మహేష్ బాబుతో చేయబోయే డైరెక్టర్ ఎలా ఉండాలి? రాజమౌళిని కొట్టేలా ఉండాలి. మరి అలాంటి డైరెక్టర్ ఎవరు? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబీ 30కి డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడనే టాక్ జోరుగా నడుస్తోంది. రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి లేదా బాబీ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. అలాగే వంశీ పైడిపల్లి, కొరటాల శివ కూడా లైన్లో ఉన్నారు. వీళ్లలో ఎవరితో ఒకరితో.. రాజమౌళి తర్వాత మహేష్ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు. అయితే వీళ్ల లెక్క తేలాలంటే.. ముందు రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లాలి.. రిలీజ్ అవ్వాలి. దానికి ఇంకో రెండు, మూడేళ్ల సమయం ఉంది. కాబట్టి.. ఇప్పట్లో ఎస్ఎస్ఎంబీ 30 గురించిన వార్తలు అనవసరమనే చెప్పాలి. ఒకవేళ SSMB 30 గురించి నిజంగానే మాట్లాడాలి అంటే రాజమౌళి తర్వాత మహేష్ బాబుతో సినిమా చెయ్యడానికి సత్తా ఉన్న దర్శకుడు సుకుమార్ మాత్రమే. పుష్ప 2 రిజల్ట్ తో సుక్కూ రేంజ్ మారిపోతుంది, ఇకపై తను కూడా అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తాడు. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఇంటర్నేషనల్ రీచ్ ని సొంతం చేసుకోని, సుకుమార్ తో సినిమా చేస్తే అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లోనే ఉంటుంది. సుకుమార్ స్క్రీన్ ప్లేకి ఒక రేంజ్ ఉంటుంది, 1 నేనొక్కడినే సినిమా ఇక్కడ ఆడలేదు కానీ సుక్కూ-మహేష్ బాబుల కాంబినేషన్ ఇలాంటి సినిమా ఒకటి SSMB 30కి సెట్ అయితే ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్ రేంజులో ఉంటుంది.

Show comments