ప్రస్తుతం ఎక్కడ చూసిన సర్కారువారి మ్యానియానే కనిపిస్తోంది. ఇంకో వారంలో మహేష్ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండడంతో ఇప్పటినుంచే మహేష్ ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టారు . పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో జరగనున్న విషయం విదితమే. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించినప్పుడు ఈ ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరిని చెప్పక్క పోవడంతో గెస్టులు ఎవరు అటెండ్ కావడం లేదని వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజాగా మేకర్స్ ఈ ఈవెంట్ కు స్టార్ గెస్ట్ రాబోతున్నారు అని ప్రకటించడంతో ఆ గెస్ట్ ఎవరా..? అని మహేష్ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఆ గెస్ట్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అని తెలుస్తోంది. మహేష్ బాబు ఫ్రెండ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం విజయ్ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక వంశి పైడిపల్లి, మహేష్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు. దీంతో ఈ ఈవెంట్ కు విజ ని కూడా ఆహ్వానించడంతో ఆయన ఓకే అన్నట్లు సమాచారం. అందులోనూ మహేష్ – విజయ్ లకు ఒకరిపట్ల మరొకరికి గౌరవాభిమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఒకే వేదికపై మహేష్- విజయ్ ల కలయిక ఫ్యాన్స్ కు కన్నుల పండగల ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు.
