NTV Telugu Site icon

Vijay Devarakonda: ఆహా.. కొండన్న చేతిలో చెయ్యేసింది ఆమెనే.. ?

Vijay

Vijay

Vijay Devarakonda: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సినిమా ఎలా ఉన్నా కానీ ప్రమోషన్స్ మాత్రం పీక్స్ లో చేయాలి అనేది మేకర్స్ నిర్ణయం. ఎందుకంటే ఏ రంగంలోనైనా ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. ఇక సినిమా రంగంలో ప్రమోషన్స్ విషయానికొస్తే కొత్త సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ ఎలాంటి ప్రమోషన్స్ చేసి అయినా సరే సినిమాపై హైప్ పెంచాలని చూస్తారు. దీనికోసమే డిఫరెంట్ డిఫరెంట్ ప్రమోషన్స్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ప్రమోషన్స్ ఎంత డిఫరెంట్ గా చేస్తే సినిమా అంత హిట్ అవుతుందని నమ్ముతారు అభిమానులు. ఇక మొదటి నుంచి కూడా రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేసే ప్రమోషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎక్కువగా విజయ్.. మ్యూజిక్ కు ప్రాధాన్యత ఇస్తాడు. మ్యూజిక్ కన్సర్ట్స్, లైవ్ షోలు, ఇంటర్వ్యూలు ఇలాంటివి చేస్తూ సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తాడు. వీటితోపాటు ఇన్స్టా గ్రామ్ లో తనదైన శైలిలో సినిమాపై పోస్టులు పెడుతూ ఉంటాడు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. అయితే తాజాగా విజయ్ దేవరకొండ పోస్ట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

Ramya Krishnan: రమ్యకృష్ణ పొలిటికల్ ఎంట్రీ.. రోజాను చూసి.. ?

” జీవితంలో చాలా జరుగుతున్నాయి కానీ ఇది మాత్రం స్పెషల్.. త్వరలో మీ అందరికీ పరిచయం చేయనున్నాను” అంటూ ఒక పోస్ట్ షేర్ చేశాడు. ఒక అమ్మాయి చేతిలో చెయ్యి వేసిన ఫోటో షేర్ చేయడంతో.. విజయ్ పెళ్ళికి సిద్దమయ్యాడు అంటూ అభిమానులు కంగ్రాట్స్ చెప్తున్నారు. కానీ, విజయ్ ఈ స్టోరీ పెట్టడం వెనుక ఉన్న కారణం ఏంటి అనేది ఎవరికీ అర్థం కాని విషయం గా మారింది. పెళ్లి గురించా..? లేక ఏదైనా ప్రమోషన్ స్టంటా అనేది అభిమానులకు అంత పట్టడం లేదు. ఇక ఈ ఫోటో చూసిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఎవరికివారు ఆ హ్యాండ్ తమకు నచ్చిన హీరోయిన్ పేరును జోడించి ఊహించేసుకుంటున్నారు. కొంతమంది రష్మిక అంటుండగా.. ఇంకొంతమంది సమంత అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అదేం లేదు.. విజయ్ కి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే.. ఆ చెయ్యి ఆమెదే అని చెప్పుకొస్తున్నారు. ఇవేమీ కాదు ఖుషీ ప్రమోషన్స్ లో భాగంగానే ఈ పోస్టులు చేశాడని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఈ ఒక్క ఫోటోతో విజయ్ దేవరకొండ ఓ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అసలు దీనికి సమాధానం ఏంటి..? కొండన్న చేతిలో చెయ్యేసింది ఎవరు అనేది తెలియాలంటే విజయ్ నోరు విప్పే వరకు ఆగాల్సిందే.