NTV Telugu Site icon

Tollywood : మెగా మల్టీస్టారర్ కు శ్రీకారం.. దర్శకుడు ఎవరంటే.?

Chiru,nag

Chiru,nag

టాలీవుడ్‌కి నాలుగు స్థంభాలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌. వీరి కాంబినేషన్ సెట్ అయితే చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తునే ఉన్నారు. కానీ ఈ కాంబినేషన్స్ మాత్రం సెట్ కాలేదు. ఒకప్పుడు ఫ్యాన్స్ వార్, హీరోల మధ్య పోటీ, స్టార్ ఇమేజ్‌వంటి కారణంగా మల్టీ స్టారర్  సినిమాలు చేయడం సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ పెరిగింది. స్టార్ హీరోలు కూడా మల్టీస్టారర్ చేయడానికి రెడీ అవుతున్నారు.

Also Read : Dil Raju : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ..

ఈనేథ్యంలో కొన్ని ఊహించని కాంబినేషన్స్ సెట్ అయ్యేలా ఉన్నాయి. ఇప్పటికే తాను, బాలయ్య మల్టీస్టారర్ చేయడానికి రెడీ అని తమ కోసం ఒకమంచి స్టోరీ రెడీ చేయమని బోయపాటికి బంపర్ ఆఫర్ ఇచ్చారు మెగాస్టార్. ఇక చిరు, నాగ్‌ కలిసి నటిస్తే చూడాలని మెగా, అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరితో సినిమా చేయడానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్యతో భగవంత్ కేసరి, వెంకీతో ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు చేసిన అనిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగాస్టార్‌తో చేస్తున్నాడు. వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాను చిరు, నాగ్ మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ దిశగా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే నలుగురు సీనియర్ హీరోలతో సినిమాలు చేసిన క్రెడిట్ అనిల్ రావిపూడికి దక్కడంతో పాటు చిరు, నాగ్‌ను ఒకే స్క్రీన్ పై చూడాలనే అభిమానుల కల కూడా నిజం కానుంది. ఈ నలుగు స్టార్ హీరోల్లో ఏ కాంబో సెట్ అయిన సరే  ఈ సినిమాలు టాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిలో  నిలుస్తాయి. మరి ఫ్యూచర్లో ఈ క్రేజీ కాంబోలు సాధ్యమవుతాయేమో అవుతాయేమో చూడాలి.

Show comments