Site icon NTV Telugu

Sujith : ఎవరీ సుజీత్.. అతని ఆస్తులు, చదువు ఏంటంటే..?

Sujith

Sujith

Sujith : పవర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. చాలా కాలం తర్వాత పవన్ కల్యాన్ కు ఓజీ మూవీతో మంచి హిట్ పడ్డట్టే కనిపిస్తోంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో సుజీత్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఎందుకంటే ఎంతో మంది డైరెక్టర్లు ఇవ్వలేని హిట్.. సుజీత్ ఇచ్చి పడేశాడు. అందుకే సుజీత్ గురించి తెగ వెతికేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. సుజీత్ ఎవరో కాదు.. పవన్ కల్యాణ్‌ కు వీరాభిమాని. అతను అనంతపూర్ లో పుట్టి పెరిగాడు. చిన్నప్పుడు జానీ సినిమా చూసి తలకు బ్యాండ్ కట్టుకుని నెల రోజుల దాకా తీయలేదంట. ఆ సినిమాతోనే అతనికి మూవీలపై ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పటి నుంచే సినిమాలు తీయాలనే కలలతో పెరిగాడు.

Read Also : OG : ఓజీ మూవీ టీమ్ కు హైకోర్టులో ఊరట..

17 ఏళ్లకే షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలు పెట్టేశాడు. చెన్నైలో డైరెక్షన్ కోర్సు తీసుకున్నాడు. పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేందుకు ట్రై చేసినా కుదరలేదు. కానీ షార్ట్ ఫిలింస్ చేస్తూ మరింత రాటుదేలాడు. అతని ట్యాలెంట్ చూసి యూవీ క్రియేషన్స్ వాళ్లు పిలిచి ఆఫర్ ఇచ్చారు. ఇంకేముంది రన్ రాజా రన్ సినిమా తీసి మంచి హిట్ కొట్టాడు. ఆ మూవీ దెబ్బకు ఏకంగా ప్రభాస్ పిలిచి ఛాన్స్ ఇచ్చాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ తో సుజీత్ తీసిన సాహో అప్పటి పరిస్థితులను బట్టి ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. ఆ మూవీ తర్వాత పవన్ నుంచి కాల్ వచ్చింది. ఓజీ సినిమా తీసి ఇప్పుడు ఏకంగా కొట్టేశాడు. 2022లో ఈ మూవీ మొదలైతే.. మూడేళ్లు టైమ్ తీసుకుంది. సుజీత్ కు 2020లోనే ప్రవళిక రెడ్డి అనే డెంటిస్ట్ తో పెళ్లి అయంది. అతను చదువు మధ్యలోనే ఆపేశాడు. ఆస్తుల పరంగా చూసుకుంటే.. సుజీత్ కు రూ.25 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.

Read Also : Rithu Chowdary : ఎంతమందితో ఎఫైర్ పెట్టుకుందో.. రీతూపై గౌతమి ఆరోపణలు

Exit mobile version