ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నారు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషి, ఫ్యామిలీ స్టార్ రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ డిజాస్టర్స్ గా నిలిచాయి. కింగ్డమ్ రిజల్ట్ తో కాస్త డీలా పడిన దేవరకొండ ఎలాగైన హిట్ కొట్టి తానేంటో మరోసారి నిరూపించాలని పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన అనే సినిమాలో నటిస్తున్నాడు.
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు సంస్థ SVC బ్యానర్ లో 49వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి రాజావారు రాణీవారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. తోలి సినిమాను క్లాస్ గా డైరెక్ట్ గా చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు విజయ్ దేవరకొండతో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ కు డేట్ లాక్ చేశారు. ఈ గురువారం అనగా 18వ తేదిన రౌడీ జనార్దన టీజర్ రిలీజ్ కాబోతుంది. అందుకోసం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో ఈవెంట్ నిర్వహించబోతున్నారు. సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి తన మార్కెట్ ను కాపాడుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. అటు కీర్తి సురేష్, ఇటు విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజుకు దర్శకుడు రవి కిరణ్ కోలాకు ఈ సినిమా విజయం చాలా కీలకం.
