Pushpa 2: ఇది సార్ పుష్పరాజ్ గాడి రేంజ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అని రాజమౌళి క్రియేట్ చేసిన పజిల్ రేంజులో… పుష్ప ఎక్కడ? #WhereisPuspa అంటూ సుకుమార్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అల్లు అర్జున్ బర్త్ డే రోజున వేర్ ఈజ్ పుష్ప అంటూ మూడు నిమిషాల వీడియోని రిలీజ్ చేసి పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ హైప్ క్రియేట్ చేశాడు సుకుమార్. అసలు పుష్ప2 వీడియో చూసిన తర్వాత ఇప్పటివరకూ ఉన్న అంచనాలన్నీ తారుమారయ్యాయి. టైటిల్ రెడ్ నుంచి గోల్డ్ కి మారడం, చైనా, జపాన్ లకి కథని లింక్ చెయ్యడం లాంటి విషయాలు పాన్ ఇండియా ఫాన్స్ ని అట్రాక్ట్ చేశాయి. ముఖ్యంగా వీడియో కంటే బన్నీ అమ్మవారి లుక్ మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది, బన్నీ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. ఈ బర్త్ డేకి జస్ట్ పోస్టర్ అండ్ వీడియోతోనే సరిపెట్టుకున్నాం.. కానీ నెక్స్ట్ బర్త్ డే ఇలా ఉండదు బన్నీ దెబ్బకి పాన్ ఇండియా బాక్సాఫీస్ లెక్కలన్నీ మారుతాయని అల్లు అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పుష్ప2 వీడియో యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న విధానం చూస్తున్న హైప్ ఈజ్ రియల్ అనిపించకమానదు. తెలుగుతో పాటుగా, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో పుష్ప వీడియో దుమ్ముదులిపేస్తోంది. ఈ వీడియోకి యూట్యూబ్‌లో రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ వస్తున్నాయి. అయినా సుకుమార్, అల్లు అర్జున్ కలిస్తే రికార్డులు బ్రేక్ అవ్వకుండా ఎలా ఉంటాయి.
సినిమాని రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ లెక్కలు, ప్రమోషనల్ కంటెంట్ వదిలితే సోషల్ మీడియా రికార్డులు లెక్కలు మార్చడం సుక్కు, బన్నీ కాంబినేషన్ కి అలవాటైన పనే. పుష్ప 2 వీడియో ఇప్పటి వరకూ అన్ని భాషల్లో కలిపి.. 75 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాగా, 3 మిలియన్స్‌కి పైగా లైక్స్ వచ్చాయి. పుష్ప2కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. నెక్స్ట్ షెడ్యూల్‌ని ‘మల్కన్‌గిరి’ ఫారెస్ట్‌లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు పుష్ప2ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో బన్నీ, సుకుమార్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!