NTV Telugu Site icon

Akhil : అయ్యగారు సినిమా అప్డేట్ ఎప్పుడు ఇస్తారో?

Akhil

Akhil

కొన్ని సంవత్సరాలుగా అక్కినేని వారసులు ప్లాపులతో సతమతమౌతున్నారు. లవ్ స్టోరీ తర్వాత సరైన హిట్టు లేక బాధపడుతున్న చైతూ ఖాతాలో రీసెంట్లీ తండేల్ రూపంలో బ్లాక్ బస్టర్ పడింది. ఏకంగా వంద కోట్ల కలెక్ట్ చేసిన ఈ మూ నాగ చైతన్య కెరీర్‌లోనే హయ్యర్ గ్రాసర్ మూవీగా నిలిచింది. టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కూడా తెలుగులో బంగ్రాజు తర్వాత హిట్ సౌండ్ వినలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన నా సామి రంగా మిక్స్ డే రివ్యూస్ తెచ్చుకుంది. దీంతో నాగ్ సైతం రూట్ మార్చి కంటెంట్ స్టోరీలపై కాన్సట్రేషన్ చేశాడు. ప్రజెంట్ శేఖర్ కమ్ముల కుబేరతో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న కూలీలో స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ రెండింట్లో ఒక్క బొమ్మ బ్లాక్ బస్టర్ సౌండ్ విన్నా మళ్లీ మన్మధుడు హిట్ ట్రాక్ ఎక్కినట్లే.

Also Read : ATLEE : అట్లీ- సల్మాన్ ఖాన్ సినిమాపై ఇంట్రస్టింగ్ బజ్

డాడీ, చైతూలు ఇంచుమించు ఫామ్ లోకి వచ్చేశారు. కానీ అఖిల్ మాత్రం టూ ఇయర్స్ నుండి సినిమాల జోలికి వెళ్లలేదు. 2023లో వచ్చిన ఏజెంట్ డిజాస్టర్ తర్వాత కొత్త మూవీకి కమిటవ్వలేదు. అలాగే ఓటీటీ ప్రేక్షకుల చెంతకు కూడా చేరలేదు ఏజెంట్. కానీ ఎట్టకేలకు డిజిటల్ ప్రీమియర్‌కు మోక్షం దక్కింది. మార్చి 14న సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది ఏజెంట్. అయితే అఖిల్ నుండి నయా ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ లేదు. వినరో భాగ్యము విష్ణు కదా ఫేం మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. శ్రీలీల కూడా హీరోయిన్ గా కన్ఫమ్ అయినట్లు టాక్. ఈ సినిమాకు లెనిన్ అనే టైటిల్ కూడా వినిపించింది కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి అఖిల్  సినిమా నుండి అఫీషియల్ ప్రకటన ఎప్పుడు ఇస్తారొనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.