NTV Telugu Site icon

Samaira ka Marriage: కరిష్మా కూతురు సమైరా బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు?

Minister Roja

Minister Roja

Samaira ka Marriage: కరిష్మా కపూర్ కూతురు సమైరా. వయసు 17. తను ఎయిర్‌పోర్ట్‌లో పాపరాజీ మీడియా కంట్లో పడిపోయింది. తన బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడనే ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పటికే సమైరా ప్రజాదరణ పొందిన స్టార్ కిడ్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. కష్మా, మాజీ భర్త సంజయ్ కపూర్‌ జంటకి సమైరా, కియాన్ రాజ్ కపూర్ అనే ఇద్దరు పిల్లలు. కరిష్మాకి ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో క్యాజువల్స్‌లో అందంగా ఓ స్నేహితుడితో కలిసి మీడియా కంట పడింది సమైరా. దీంతో తనని జాన్వీ కపూర్ తో పోలుస్తున్నారు నెటిజెన్స్. అసలు సమైరాకు నటన పట్ల ఆసక్తి ఉందా!? తన కుమార్తె నటి కావటంపై కరిష్మా ఏమనుకుంటోంది? అన్న విషయాలపై క్లారిటీ లేదు. మరి ఈ స్టార్ కిడ్ రాబోయే రోజుల్లో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Read Also: Phalana Abbayi Phalana Ammayi: దశాబ్దపు ప్రేమ ప్రయాణం!