NTV Telugu Site icon

Aadikeshava : ఆదికేశవ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

Whatsapp Image 2023 12 16 At 11.30.45 Pm

Whatsapp Image 2023 12 16 At 11.30.45 Pm

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, క్రేజీ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ సినిమా నవంబర్ 24న థియేటర్లలో విడుదల అయింది.దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఆదికేశవ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. కాగా, ఆదికేశవ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍పై తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది.ఆదికేశవ సినిమా డిసెంబర్ 22వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని తాజాగా సమాచారం అందింది.. దీని ప్రకారం థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది.. అయితే, ఆదికేశవ స్ట్రీమింగ్ డేట్ గురించి నెట్‍ఫ్లిక్స్ ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. డిసెంబర్ 22న ఆదికేశవ స్ట్రీమింగ్‍కు వస్తుందనే వార్త బాగా వైరల్ అవుతుంది.

అయితే ఆదికేశవ సినిమాలో ఓవర్ డోస్ యాక్షన్ సీన్లు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కథ, కథనం కూడా కొత్తగా లేకపోవటంతో ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్‍ ను అందుకుంది. ఈ సినిమా ఫలితానికి తగ్గట్టుగానే కలెక్షన్లు కూడా పేలవంగానే వచ్చాయి.ఆదికేశవ సినిమాలో జోజు జార్జ్, సుమన్, తనికెళ్ల భరణి, సుదర్శన్, అపర్ణా దాస్, జయప్రకాశ్ మరియు రాధికా శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ మూవీకి సంగీతం అందించారు.అన్యాయాలు చూసి సహించని హీరో బాలు (వైష్ణవ్ తేజ్),  హీరోయిన్ చిత్రావతి (శ్రీలీల) అతడి ప్రేమలో పడడం, హీరోకు కుటుంబానికి ఓ ఫ్యాక్షన్ బ్యాక్‍గ్రౌండ్ ఉండడం వంటి అంశాల చుట్టూ ఆదికేశవ మూవీ కథ తిరుగుతుంది. తన సొంత ఊరికి వెళ్లి విలన్‍ను హీరో ఎలా అంతమొందించాడన్నదే ఆ సినిమా ప్రధాన పాయింట్‍గా ఉంది.అయితే థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోని ఆదికేశవ ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి