Aadikeshava : ఆదికేశవ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, క్రేజీ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ సినిమా నవంబర్ 24న థియేటర్లలో విడుదల అయింది.దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఆదికేశవ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. కాగా, ఆదికేశవ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍పై తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది.ఆదికేశవ సినిమా డిసెంబర్ 22వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని తాజాగా సమాచారం అందింది.. దీని ప్రకారం థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది.. అయితే, ఆదికేశవ స్ట్రీమింగ్ డేట్ గురించి నెట్‍ఫ్లిక్స్ ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. డిసెంబర్ 22న ఆదికేశవ స్ట్రీమింగ్‍కు వస్తుందనే వార్త బాగా వైరల్ అవుతుంది.
అయితే ఆదికేశవ సినిమాలో ఓవర్ డోస్ యాక్షన్ సీన్లు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కథ, కథనం కూడా కొత్తగా లేకపోవటంతో ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్ ను అందుకుంది. ఈ సినిమా ఫలితానికి తగ్గట్టుగానే కలెక్షన్లు కూడా పేలవంగానే వచ్చాయి.ఆదికేశవ సినిమాలో జోజు జార్జ్, సుమన్, తనికెళ్ల భరణి, సుదర్శన్, అపర్ణా దాస్, జయప్రకాశ్ మరియు రాధికా శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ మూవీకి సంగీతం అందించారు.అన్యాయాలు చూసి సహించని హీరో బాలు (వైష్ణవ్ తేజ్), హీరోయిన్ చిత్రావతి (శ్రీలీల) అతడి ప్రేమలో పడడం, హీరోకు కుటుంబానికి ఓ ఫ్యాక్షన్ బ్యాక్‍గ్రౌండ్ ఉండడం వంటి అంశాల చుట్టూ ఆదికేశవ మూవీ కథ తిరుగుతుంది. తన సొంత ఊరికి వెళ్లి విలన్‍ను హీరో ఎలా అంతమొందించాడన్నదే ఆ సినిమా ప్రధాన పాయింట్‍గా ఉంది.అయితే థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోని ఆదికేశవ ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి
Also Read
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
తాజావార్తలు
-
US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
-
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!