Tarun Bhascker: పెళ్లి చూపులు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. విజయ్ దేవరకొండను హీరోగా నిలబెట్టి.. మొదటి హిట్ ను అందించిన డైరెక్టర్ గా తరుణ్ గుర్తుండిపోయాడు. ఇక ఈ సినిమా తరువాత ఈ నగరానికి ఏమైంది అనే క్లాసిక్ మూవీని తెరకెక్కించాడు. ఎన్నేళ్లు అయినా.. స్నేహితులతో కలిసి చూసే సినిమాలు లిస్ట్ తీస్తే.. మొదటి వరుసలో ఉండే సినిమా ఈ నగరానికి ఏమైంది.ఇక ఈ సినిమాకు సీక్వెల్ రానుందని తరుణ్ చెప్తూ వస్తున్నాడు తప్ప సెట్స్ మీదకు తీసుకెళ్లింది లేదు. ఇక తరుణ్ డైరెక్షన్ గురించి పక్కన పెడితే.. నటుడిగా తనకంటూ గుర్తింపును తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాడు. మీకు మాత్రమే చెప్తా అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం కీడా కోలా అనే సినిమాను తెరకెక్కించడమే కాకుండా .. అందులో ఒక పాత్రలో కూడా నటించి మెప్పించాడు. రేపు ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.
Salaar: ప్రశాంత్ నీల్ ట్విస్టులు ఇస్తూనే ఉన్నాడుగా…
ఇక కీడా కోలా కాకుండా తరుణ్ .. మరో సినిమాలో ఒక స్పెషల్ క్యామియో చేస్తున్నాడు. అదే మంగళవారం. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేసారు. ఈ స్పెషల్ సాంగ్ లో తరుణ్ భాస్కర్ డ్యాన్స్ వేయనున్నాడు. అప్పడప్పడ తాండ్ర అంటూ సాగే ఈ సాంగ్ గురించి తరుణ్ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. మంగళవారంలో తరుణ్ భాస్కర్ ఏం చేస్తున్నాడు అనే టైటిల్ తో ఆ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో తరుణ్.. చిన్న పిల్లలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకొచ్చాడు. తనది లోకల్ కాదు హైదరాబాద్ అని.. షూటింగ్ ఉంటే ఇక్కడకు వచ్చానని తెలిపాడు. తాను ఒక డైరెక్టర్ అని, అక్కడ ఈ నగరానికి ఏమైంది 2 తీయమని అభిమానులు చంపేస్తున్నారని, త్వరలోనే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు తెలిపాడు. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్నానని, తనకు డ్యాన్స్ రాకపోయినా ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉండాలి. అందుకే నన్ను పిచ్చోడు… డైరెక్షన్ తప్ప అన్ని చేస్తాడు అని అంటారు అని తనమీదనే సెటైర్ వేసుకున్నాడు.ఇకపోతే ఈ సినిమా నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అజయ్ భూపతి ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
What's @TharunBhasckerD doing in #Mangalavaaram ?🤔
A special song #AppadappadaTandra from #Mangalavaaram to stream on Nov 3rd, 4:05 PM 🔥
✍🏻 @lyricistganesh
🎤 @RahulsipligunjAn @AJANEESHB Musical 🎶 #MangalavaaramOnNov17th@starlingpayal @Nanditasweta @MudhraMediaWrks… pic.twitter.com/0YZO6Dwelk
— Ajay Bhupathi (@DirAjayBhupathi) November 2, 2023