Ghaati : సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఘాటీ. డైరెక్టర్ క్రిష్ తీసిన ఈ సినిమా రెండు వాయిదాల తర్వాత సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమాకు ప్రమోషన్లు మాత్రం పెద్దగా చేయట్లేదు. కేవలం ట్రైలర్ ను రిలీజ్ చేసి ఊరుకున్నారు. ఈ రోజుల్లో గ్లింప్స్ రిలీజ్ చేసినా సరే ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అలాంటిది ట్రైలర్ కు ఎలాంటి ఈవెంట్ నిర్వహించలేదు. మూవీ రిలీజ్ కు ఇంకో పది రోజులే ఉన్నాయి. కానీ ఎలాంటి ప్రమోషన్లు కనిపించట్లేదు. ఇంటర్వ్యూలు, ఈవెంట్లు లేవు.
Read Also : Peddi : ఆమె రామ్ చరణ్ కు తల్లా.. బుచ్చిబాబు ఏంటిది..?
కేవలం సినిమా నుంచి అప్డేట్లు ఇస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. అనుష్కను నమ్ముకుని భారీగా బడ్జెట్ పెట్టేశారు. పెట్టిన బడ్జెట్ రావాలంటే ఈ రోజల్లో భారీగా హైప్ పెంచేయాలి. దానికి ప్రమోషన్లు తప్పనిసరి. కానీ అనుష్క మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది. అదే రోజున తెలుగు నుంచి రెండు సినిమాలు, తమిళం నుంచి రెండు సినిమాలు వస్తున్నాయి. వాటన్నింటి పోటీని తట్టుకుని భారీ ఓపెనింగ్స్ రాబట్టాలంటే అనుష్క ఇలా సైలెంట్ గా ఉంటే కుదరదు. ఒకవేళ మూవీని వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయా అంటే లేవు. ఆల్రెడీ మూవీ చాలా లేట్ అయిపోయింది. కాబట్టి ప్రమోషన్లు చేయకుండా ఇలా సైలెంట్ గా ఉంటే కలెక్షన్లు దెబ్బతింటాయి. ఆ ఎఫెక్ట్ అనుష్క రాబోయే సినిమాలపై కూడా పడే ఛాన్స్ ఉంటుంది.
