ఇప్పటి వరకు నందమూరి హీరోలు కలిసి నటించిన సందర్భాలు లేవు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం.. తన బింబిసార మూవీ సీక్వెల్స్‌లో ఎన్టీఆర్‌తో కలిసి నటించబోతున్నానని చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో.. అసలు బింబిసారలో ఏ పార్ట్‌లో ఎన్టీఆర్ నటించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా రాబోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. అందుకే బింబిసార అనే సాలిడ్ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఆగస్టు 5న విడుదలకు సిద్దమవుతోంది. అయితే మొన్నటి వరకు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు.. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కసారిగా బింబిసార పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ట్రైలర్ విజువల్ వండర్‌గా ఉండడంతో.. ఒక కొత్త దర్శకుడితో కళ్యాణ్ రామ్ ఇంత సాహసం చేస్తున్నాడా.. అని అనిపించక మానదు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతూ.. 20 మిలియన్స్‌కు చేరువలో ఉంది. అలాగే లైక్స్ కూడా 5 లక్షలకు దగ్గరగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. బింబిసారను ఓ ఫ్రాంఛైజీలా మారుస్తామని.. ఈ సినిమాకు మొత్తంగా నాలుగు భాగాలు తీసుకొస్తామని చెబుతున్నాడు కళ్యాణ్ రామ్. ఇప్పటికే ‘బింబిసార-2’ రెడీ అవుతోందని.. వచ్చే ఏడాదిలో రిలీజవుతుందని కూడా చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఏదో ఒక భాగంలో యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ నటించడం పక్కా అని.. బింబిసారపై అంచనాలు పెంచేస్తున్నాడు. ఈ న్యూస్ విని నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కానీ అసలు ఎన్టీఆర్ ఏ పార్ట్‌లో నటించబోతున్నాడనేది చర్చకు దారి తీసింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్స్ రావాలంటే.. అది బింబిసార రిజల్ట్ పైనే ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి బింబిసారలో ఎన్టీఆర్ భాగం అవుతాడా లేదా అనేది తెలియాలంటే.. ఫస్ట్ పార్ట్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
