NTV Telugu Site icon

Preview vs Prevue: జవాన్ ప్రెవ్యూ రిలీజ్.. ఇంతకీ ప్రెవ్యూ అంటే ఏంటో తెలుసా?

Preview Vs Prevue

Preview Vs Prevue

What is difference between preview and prevue: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘జవాన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో మూవీ ప్రెవ్యూని సోమ‌వారం అంటే జూలై 10న విడుద‌ల చేశారు. ఈ ప్రెవ్యూ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌ను షేక్ చేసేస్తుందని అనడంలో సందేహం లేదు. ఇక స‌మాజంలోని త‌ప్పుల‌న స‌రిదిద్ద‌డానికి ఓ వ్య‌క్తి చేసే ఎమోష‌న‌ల్ జ‌ర్నీయే హై యాక్షన్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ జ‌వాన్ సినిమా అని ప్రెవ్యూ చూస్తే అర్థ‌మ‌వుతుంది. యాక్ష‌న్ ప్యాక్డ్‌గా రూపొందిన జ‌వాన్ మూవీ ప్రెవ్యూ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది, భారీ విజువ‌ల్స్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తుందని చెప్పక తప్పదు. యాక్ష‌న్‌, ఎమోష‌న్స్ ప‌ర్‌ఫెక్ట్ కాంబినేష‌న్‌లో జ‌వాన్ అంద‌రినీ అల‌రిచంనుంద‌ని ప్రెవ్యూలో చూపించగా ప్రేక్ష‌కుల‌కు ఓ అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చిందని అంటునారు. ఇక మనం ఈ ప్రెవ్యూ చూస్తే ప్రతి ఫ్రేమ్‌లో భారీత‌నం, గొప్ప విజువ‌ల్స్‌ను చూస్తుంటే ప్రేక్ష‌కులు ఊహించిన దాని కంటే ఎక్కువ‌గా సినిమా ఉంటుంద‌నిపిస్తుంది. ఈ జ‌వాన్ ప్రెవ్యూ కింగ్ ఖాన్ షారూక్ వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభం అవుతుంది.

Komatireddy Venkatreddy: మరో 45 రోజుల్లో అసెంబ్లీ రద్దవుతుంది.. కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

ప్ర‌తి ఫ్రేమ్ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచుతూ రాగా షారూక్ ఖాన్ డిఫ‌రెంట్ లుక్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి వ‌ర‌కు రానీ విధంగా భారీ బ‌డ్జెట్‌తో పాటు భారీ తారాగ‌ణం ఈ సినిమాలో ఉందని చెప్పచ్చు. షారూక్ ఖాన్‌తో పాటు న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, దీపికా ప‌దుకొనె, సాన్యా మ‌ల్హోత్రా, ప్రియ‌మ‌ణి, గిరిజ ఓక్‌, సంజిత భ‌ట్టాచార్య‌, లెహ్రా ఖాన్‌, అలియా ఖురేషి, రిది దోగ్రా, సునీల్ గ్రోవ‌ర్‌, ముఖేష్ చ‌బ్రా త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌తో ఆస‌క్తి పెంచుతూ వ‌చ్చిన ఈ సినిమా ప్రెవ్యూ ఇప్పుడు అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేసిందని చెప్పక తప్పదు. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మర్ప‌ణ‌లో గౌరీ ఖాన్ నిర్మాత‌గా జ‌వాన్ సినిమాను నిర్మిస్తుండగా అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా నుంచి మునుపెన్నడూ వినని ప్రెవ్యూ రిలీజ్ చేయడంతో కొంతమంది అది ప్రివ్యూ అనుకుని పొరబడ్డారు. కానీ ప్రెవ్యూ – ప్రివ్యూ ఒకటి కాదు. అసలు ప్రెవ్యూ అంటే సినిమా నుంచి కొన్ని ఆసక్తికరమైన సీన్స్ తో కూడిన టీజర్ లాంటిది అని అర్ధం. రెండిటికీ దాదాపు అర్ధం ఒకటే అయినా వేర్వేరు పదాలు, వేర్వేరు సందర్భాల్లో వాడతారు.

Show comments