రీజనల్ సినిమాలతో కూడా పాన్ ఇండియా సినిమాల రికార్డులని బ్రేక్ చెయ్యగల హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హీరోయిజం అనే పదానికి నిలువెత్తు నిదర్శనంలా ఉండే పవన్ కళ్యాణ్, ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇటివలే సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదయ సిత్తం’ సినిమా తెలుగు వర్షన్ ని సెట్స్ పైకి తీసుకోని వెళ్లాడు పవన్ కళ్యాణ్. సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్న ఈ రీమేక్ మూవీ కోసం పవన్ కళ్యాణ్ దాదాపు 20 రోజులు డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈ షూటింగ్ అయిపోగానే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓకే చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని స్టార్ట్ చెయ్యనున్నాడు పవన్ కళ్యాణ్. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ తమిళ ‘తెరీ’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. పది రోజుల పాటు జరగనున్న ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ తర్వాత పవన్ కళ్యాణ్… OG రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేస్తాడు అనే రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాలన్నింటి విషయంలో ఎదో ఒక అప్డేట్ వస్తుంది కానీ అసలు పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్ట్ ఎంతవరకూ అయ్యింది? అప్డేట్స్ ఏంటి? ప్రమోషన్స్ ఎప్పటినుంచి స్టార్ట్ చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం ఎవరి దగ్గర లేదు. క్రిష్ మాత్రం పవన్ కళ్యాణ్ ;లేని సీన్స్ ని షూట్ చేసేస్తున్నట్లు ఉన్నాడు. వినోదయ సిత్తం తెలుగు వర్షన్ షూటింగ్ అయిపోయాక పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాని స్టార్ట్ చేస్తాడని అంతా అనుకున్నారు కానీ హరీష్ శంకర్ సినిమా లైన్ లోకి వచ్చేసింది. దీంతో సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు సినిమా అసలు ఉంటుందా? అనే డౌట్స్ ని రైజ్ చేస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ కి ఎండ్ కార్డ్ వెయ్యాలి అంటే హరిహర వీరమల్లు టీం అఫీషియల్ గా ఎదో ఒక అప్డేట్ ఇవ్వాల్సిందే లేదంటే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన మూవీకి నెగటివ్ ప్రచారం అనేది ఇబ్బంది కలిగించే విషయం.
