తమిళనాడు ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ఇప్పుడు అదే అధికార డీఎంకే, తమిళ బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. డీఎంకే ప్రవేశ పెట్టిన ఈ బిల్లులో తమిళనాడు రాష్ట్రంలో హిందీని నిషేధించాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనీ ప్రతిపాదిత చట్టంపై చర్చించడానికి నిన్న రాత్రి న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం కూడా నిర్వహించారు. ఈ బిల్లులో ప్రధాణంగా తమిళనాడు అంతటా హిందీ హోర్డింగ్‌లు, బోర్డులు, సినిమాలు మరియు సినిమాలకు సంబందించిన పాటలను నిషేధించాలనిపేర్కొంది. అయితే ఈ బిల్లు రాజ్యాంగానికి లోబడి ఉంటుందని కొందరు అధికారులు నొక్కి చెప్పారు. ఈ బిల్లుపై వ్యాఖ్యానిస్తూ, సీనియర్ డీఎంకే నాయకుడు టీకేఎస్ ఎలంగోవన్, “మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమీ చేయము. మేము తమిళ భాషను కాపాడుకోవాలనే నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. మా ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము” అని అన్నారు.
Also Read : NTRNeel : ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఏదో చేస్తున్నారు.. ఫ్యాన్స్ టెన్షన్?
డీఎంకే తీసుకున్న ఈ నిర్ణయాన్ని తమిళనాడు బిజెపి తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ నాయకుడు వినోజ్ సెల్వం ఈ చర్యను “సీఎం స్టాలిన్ ఓకే మూర్ఖుడు. హిందీని వ్యతిరేకించే బిల్లు ఆయన మూర్ఖత్వం మరియు హేయనీయం” భాషను రాజకీయ సాధనంగా ఉపయోగించకూడదు’ అని అన్నారు. అలాగే తిరుపరంకుండ్రం, కరూర్ దర్యాప్తు మరియు ఆర్మ్‌స్ట్రాంగ్ సమస్యలతో సహా ఇటీవలి కోర్టు కేసులలో ఎదురుదెబ్బలను ఎదుర్కొంటున్న అధికార డిఎంకె, వివాదాస్పద ఫాక్స్‌కాన్ పెట్టుబడి సమస్య నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి భాషా చర్చను ఉపయోగించి తమిళనాడు ప్రజలను మోసం చేసే విధంగా కనిపిస్తోందని డీఎంకే పార్టీపై ధ్వజమెత్తారు. డీఎంకే వర్సెస్ బీజేపీగా మారిన ఈ వివాదం చివరకు ఎటువంటి మలుపుగుతుందో చూడాలి.
