Site icon NTV Telugu

Ram Pothineni : వారియర్ ఈవెంట్‌ ఫిక్స్.. చీఫ్ గెస్ట్‌గా..?

Thw Warrior

Thw Warrior

 

త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో.. ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న ‘ది వారియ‌ర్’.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో జులై 14న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతుంది. దాంతో జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. అందులోభాగంగా.. మొన్న వారియ‌ర్ త‌మిళ వెర్ష‌న్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చెన్నైలో భారీ ఎత్తున జరిపారు. ఈ ఈవెంట్‌ కోసం త‌మిళ ఇండ‌స్ట్రీ నుంచి భారీ తారాగణం తరలొచ్చింది. స్టార్ డైరెక్ట‌ర్లు మ‌ణిర‌త్నం, శంక‌ర్‌, వెట్రిమార‌న్, భార‌తీరాజా, గౌత‌మ్ మీన‌న్, ఎస్‌జే సూర్య‌, లోకేశ్ క‌న‌గ‌రాజ్, కార్తీక్ సుబ్బ‌రాజుతో పాటు.. కార్తీ, విశాల్‌ వంటి ప‌లువురు సెల‌బ్రిటీలు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. దాంతో తమిళ్‌లో వారియర్‌కు మంచి హైప్ క్రియేట్ అవుతోంది. పైగా లింగసామికి అక్కడ మంచి మార్కెట్ ఉంది.. హీరో రామ్ సైతం భారీగా ప్రమోట్ చేస్తున్నాడు.. దాంతో అక్కడ కూడా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ఇక తెలుగులోను వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ది వారియర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 10న, అంటే ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు.. జేఆర్సి కన్వెన్షన్‌లో భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని ఒక అఫీషియల్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా ఎవరు వస్తారనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దాంతో వారియర్ ముఖ్య అథితి ఎవరు.. అనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఇక మాస్ యాక్ష‌న్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విల‌న్‌గా న‌టిస్తున్నాడు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాసా చిట్టూరి ది వారియ‌ర్‌ను నిర్మిస్తున్నారు. మరి ప్రమోషన్స్, ఈవెంట్స్‌తో అంచనాలను పెంచేస్తున్న వారియర్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి

Exit mobile version