War 2 Vs Coolie : ఆగస్టు 14న రెండు భారీ సినిమాలు ఢీకొనబోతున్నాయి. రెండూ పాన్ ఇండియా సినిమాలే. అందులో ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ.. ఇంకొకటి హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న మల్టీస్టారర్ వార్-2. కూలీ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండగా.. ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్లు కీలక పాత్రలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మించింది. వార్-2 మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా యష్ రాజ్ ఫిలింస్ నిర్మించింది. వార్-2 ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా.. కూలీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ రెండు ట్రైలర్లలో ఏది బాగుందో ఒకసారి చూద్దాం.
Read Also : Coolie Trailer : రజినీకాంత్ కూలీ ట్రైలర్ వచ్చేసింది
వార్-2 ట్రైలర్ యాక్షన్ ఫీస్ట్ గా అదిరిపోయింది. హృతిక్ రోషన్ బాడీ లాంగ్వేజ్, ఎన్టీఆర్ యాక్షన్ లాంగ్వేజ్ తో ఆకట్టుకుంది. ఆకాశంలో విమానంపై తారక్ చేసిన యాక్షన్ స్టంట్స్ అదిరిపోయాయి. కియారా, హృతిక్ రొమాన్స్ ఆకట్టుకుంది. పైగా ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఫైట్, సస్పెన్స్ కంటెంట్ అన్నీ కుదిరాయి. ఈ మూవీ కథలో సస్పెన్స్ ను మెయింటేన్ చేస్తూ ట్రైలర్ బాగుంది. ఇక కూలీ ట్రైలర్ ను 3 నిముషాలకు పైగా కట్ చేశారు. ఇందులో పాత్రలను పరిచయం చేయడానికే ఎక్కువ స్పేస్ ఇచ్చారు. కథ, కథనం వైపు ట్రైలర్ ను నడిపించకుండా.. పాత్రల పరిచయం.. రెండు యాక్షన్ షాట్స్ తో లాగించేశాడు లోకేష్. అసలు కథ గురించి మెయిన్ గా చెప్పకుండా పాత్రలు, హైప్ మీదనే దృష్టి పెట్టాడు. అదే ట్రైలర్ కు మైనస్ అయింది. ఇది విజువల్ పరంగా బాగానే ఉంది. రజినీ లుక్, మిగతా పాత్రల యాక్షన్ ఆకట్టుకుంటున్నాయి. కానీ కథ కోణం ఇందులో మిస్ అయింది.
Read Also : Abhinay Kinger : హీరోకు భయంకరమైన రోగం.. త్వరలోనే చనిపోతాడంట
