Site icon NTV Telugu

Exclusive : వార్ 2.. ఎండ్ కార్డ్స్ లో ఊహించని సర్ప్రైజ్.. గెట్ రెడీ ఫర్ డబుల్ బొనాంజా

Yrf

Yrf

యంగ్ టైగర్ ఎన్టీఆర్,  బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్  కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వార్ 2. యష్ రాజ్ ఫిల్మ్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి.  యష్ రాజ్ ఫిల్మ్స్ నిమిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

Also Read : South Stars : 60 ఏళ్ల వయసులో అల్లాడిస్తున్న సీనియర్ హీరోలు

“YRF స్పై యూనివర్స్ నుండి వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వార్ 2  ఎండ్ క్రెడిట్ రోల్ క్రేజీ సర్ప్రైజ్ ప్లాన్ చేశారట. ఈ  స్పై-వర్స్ నుండి రాబోయే రెండు సినిమాల ప్లాట్ పాయింట్లను రివీల్ చేయబోతున్నారని ముంబై వర్గాల సమాచారం. YRF ప్రేక్షకులకు మరియు అభిమానులకు ఈ స్పెషల్ సర్పైజ్ కు షాక్ అవుతారని టాక్. అందుకే వార్ 2 సినిమా చూసేసి హడావిడిగా బయటకు రాకుండా దాని ఎండ్ క్రెడిట్‌లు కూడా తప్పక చూడాలని చెప్తున్నారు. YRF స్పై యూనివర్స్‌ను మార్వెల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇప్పుడు రాబోయే రెండు అప్డేట్డ్స్ ఏంటి అసలు దేని గురించి అనే క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్.   వార్ 2 యొక్క ఎండ్ క్రెడిట్‌లలో కొత్త పాత్రలు ప్రవేశపెడతారా లేదా కొత్త చిత్రం ప్రకటించబడుతుందా అని తెలుసుకోవడానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. మరి వార్ 2 ఎండ్ టైటిల్స్ లో వచ్చే సప్రైజ్ లో కనిపించబోయే హీరో ఎవరో చూడాలి.

Exit mobile version