Site icon NTV Telugu

War 2 : డిజిటల్ రిలీజ్‌కు రెడి అయిన ‘వార్ 2’ !

War2 Ott

War2 Ott

ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్యాన్స్, ఆడియన్స్ ను నిరాశ పరిచిన సినిమాల్లో ‘వార్ 2’ ఒకటి. యాష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, తెలుగు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. అయితే, భారీ అంచనాలకు విరుద్ధంగా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. కానీ హిందీ వెర్షన్‌కి ఇప్పటికీ డీసెంట్ లెవెల్ లో వసూళ్లు వచ్చాయి. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా డిజిటల్ రిలీజ్ పై దృష్టి సారించారు.

Also Read : Poorana : డివోర్స్ లిస్ట్‌లో మరో హీరోయిన్.. భర్త పోస్ట్ వైరల్

కాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాల్లోపు ఓటీటీలో రిలీజ్ చేయాలి. అందుకే, ఈ సినిమాను సెప్టెంబర్ 12, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ చేశారట. అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడనుంది. అదే సమయంలో, గతంలో వచ్చిన ‘వార్ 1’ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాగా, ‘వార్ 2’ ను నెట్‌ఫ్లిక్స్ కి అమ్మడం స్పెషల్ గా మారింది. మరి థియేటర్స్ లో ప్రేక్షకులను ఒకింత ఆకట్టుకోలేకపోయిన ‘వార్ 2’.. ఓటీటీలో అయిన మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందేమో చూడాలి.

Exit mobile version