Poorana : హీరోయిన్ విడాకుల రూమర్స్‌కు.. చెక్ పెట్టిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరికి సంబంధించిన ఏ చిన్న పోస్ట్ అయినా పెద్ద హంగామాకే దారితీస్తుంది. పెళ్లి, విడాకులు, సంబంధాలపై వచ్చే రూమర్స్ అభిమానులను మాత్రమే కాదు, మీడియాను కూడా ఆకర్షిస్తాయి. తాజాగా అలాంటి వార్తల్లో పూర్ణ (షమ్నా కాసిం) పేరు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Bigg Boss 9: లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ సారి డబుల్ హౌస్, డబుల్ డోస్
Also Read
- Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: 'రుద్రవనం'లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
- Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?
- Donga Naa Koduku Teaser: ఏంటి మౌళి.. పబ్లిక్‌గా టిఫిన్ చేసేస్తున్నావ్..! ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల..
- Jayaho Ramanuja: సంస్కృతంతో సహా ఆరు భాషల్లో 'జయహో రామానుజ'
2022లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని తో పూర్ణ వివాహం కన్నుల పండుగా జరిగిన విషయం తెలిసిందే. వీరికి ఓ మగబిడ్డ కూడా జన్మించారు. ఆ తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను అలరించారు. అయితే రీసెంట్గా పూర్ణ భర్త షానిద్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్టు ఒక్కసారిగా వైరల్ అయ్యింది.
ఆయన.. ‘నా జీవితంలో ఈ 45 రోజులు మరచిపోలేని రోజులు. ఒంటరితనాన్ని భరించలేకపోయాను. నీ జ్ఞాపకాలతోనే రాత్రులు గడపాల్సి వచ్చింది. మనల్ని ప్రేమించే వారు మనతో ఉండడమే జీవితంలో గొప్ప వరం. ఈ రోజు నా భార్య తిరిగి నా దగ్గరకు వచ్చేసింది’ అంటూ ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.. ఇద్దరి మధ్య ఏదైనా సమస్య జరిగింది?,వారు విడిపోతున్నారా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. మీడియా కూడా ఈ వార్తను హైలైట్ చేయడంతో పుకార్లు మరింత వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో క్లారిటీ వెంటనే ఇచ్చిన భర్త.. ఈ పోస్ట్ వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించారు.. ‘నా భార్య 45 రోజులు నన్ను దూరంగా ఉంది. పెళ్లి అయిన తర్వాత ఇంతకాలం ఎప్పుడూ దూరంగా లేం. అందుకే ఎమోషనల్‌గా ఆ పోస్ట్ రాసాను. దయచేసి దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మేము దేవుడి దయతో సంతోషంగానే ఉన్నాం’ అని క్లారిటీ ఇచ్చారు. మొత్తనికి ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
Fake Press IDs: అంగట్లో జర్నలిస్టు ఐడీలు.. రూ.599 చెల్లిస్తే చాలు..
-
NZ Vs IND: కివీస్‌తో తొలి టీ20.. బరిలోకి స్టార్ ప్లేయర్.. పిచ్ రిపోర్ట్, తుది జట్ల వివరాలు ఇవే..
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!