Site icon NTV Telugu

WAR -2 : వార్ -2 ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన

War2

War2

WAR -2 : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2 ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. యాక్షన్ సీన్లు, డ్యాన్స్ బాగున్నా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో కథ, కథనం లేకపోవడం మైనస్ అయింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై రకరకాల ప్రచారాలు జరిగాయి. అందరూ అనుకున్నట్టుగానే ఓటీటీ రిలీజ్ డేట్ ను తాజాగా అఫీషియల్ గా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. అక్టోబర్ 9 అంటే రేపటి నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని పోస్టర్ రిలీజ్ చేశారు. ముందు నుంచే అక్టోబర్ 8 తర్వాత స్ట్రీమింగ్ ఉంటుందనే ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టు గానే ఇప్పుడు రిలీజ్ డేట్ వచ్చింది. కొన్ని సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో ఆకట్టుకుంటాయి.

Read Also : Prabhas : ప్రభాస్ సాయం చేస్తే హిట్టే.. రెబల్ సెంటిమెంట్

ఇప్పుడు వార్-2 కూడా అలాగే ఆడుతుందని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ సినిమా వార్ సినిమాకు సీక్వెల్ గా తీసుకొచ్చారు. ఇందులో ఇద్దరు సైనికుల మధ్య జరిగిన పోరును హైలెట్ చేస్తూ మూవీని నడిపించారు. అయాన్ ముఖర్జీ ఎంతో కష్టపడి తీసిన ఈ సినిమాను యష్‌ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ నటన, డ్యాన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. కానీ కథ వీక్ గా ఉండటం మైనస్ అయింది. ఈ సినిమాను తెలుగులో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్ తో రిలీజ్ చేసింది. తెలుగు నాట పెద్దగా కలెక్షన్లు రాలేదు. కానీ హిందీలో యావరేజ్ గా కలెక్షన్లు వచ్చాయి.

Read Also : Kalyani Priyadarshan : బాబోయ్.. కల్యాణి ప్రియదర్శిన్ ఫోజులు చూస్తే అంతే

Exit mobile version