Site icon NTV Telugu

War 2 Pre Release Event : వార్-2 పక్కా తెలుగు సినిమానే.. డబ్బింగ్ కాదు : నాగవంశీ

Nagavamshi

Nagavamshi

War 2 Pre Release Event : ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. నాకు ఇద్దరి ముందు మాట్లాడాలంటే భయం వేస్తుంది. అందులో ఎన్టీఆర్ ఒకరు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకొకరు. ఈ సినిమాపై రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇది డబ్బింగ్ సినిమా కానే కాదు. ఇది పక్కా తెలుగు సినిమానే.

Read Also : WAR 2 Pre Release Event : వార్-2 ఈవెంట్ లో అడుగు పెట్టిన హృతిక్, ఎన్టీఆర్

ఎవరి మాటలు నమ్మకండి. మూవీ కోసం థియేటర్లకు వెళ్లండి. మీరు ఎప్పుడూ చూడని విధంగా ఉంటుంది. ఇది తెలుగు సినిమా కాబట్టి హిందీ కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు రావాలి. అది ఎన్టీఆర్ అభిమానుల బాధ్యత. ఈ రోజు ఎన్టీఆర్ అన్న మనకోసం కాలర్ ఎగరేశారు. రేపు ఇండియన్ బాక్సాఫీస్ ముందు ఆయన కాలర్ ఎగరేసేలా మనం చేయాలి అంటూ చెప్పుకొచ్చారు నాగవంశీ.

Exit mobile version