మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారంలోకి మారి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మాస్ మహారాజ రవితేజ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీని బాబీ డైరెక్ట్ చేశాడు. చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్ అయిన బాబీ, మెగా అభిమానులకి వింటేజ్ మెగాస్టార్ ని గుర్తుకు తెచ్చే రేంజులో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని రూపొందించాడు. ఇప్పటివరకూ బయటకి ప్రమోషనల్ కంటెంట్ చూస్తే జనవరి 13న థియేటర్స్ టాప్ లేచిపోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఈ సినిమాని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ కూడా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని ఆన్ లైన్-ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ కారణంగానే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అవుతోంది. రిలీజ్ కి ఇంకా వారం రోజుల సమయం ఉండగానే కేవలం అమెరికా సెంటర్స్ లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా అడ్వాన్స్ సేల్స్ రూపంలో 100K మార్క్ ని టచ్ చేసింది అంటే, ఈ మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
బుకింగ్స్ స్టార్ట్ అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే దాదాపు ఇదే పరిస్థితి నెలకొంటుంది. టికెట్స్ కోసం మెగా అభిమానులే కాదు రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా థియేటర్స్ కి క్యు కడతారు. ఇదిలా ఉంటే సెన్సార్ వర్క్స్ పూర్తి చేసుకున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి ‘U/A’ సర్టిఫికేట్ లభించింది. రెండు గంటల 40 నిమిషాల నిడివితో వాల్తేరు వీరయ్య ఫైనల్ కట్ ని రెడీ చేశారు. ప్రస్తుతం సెన్సార్ నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం, వాల్తేరు వీరయ్య సినిమా ఆడియన్స్ కి 2 అవర్స్ 40 మినిట్స్ పూనకలు తెప్పించే రేంజులో ఉంటుందట. ఒక ఫ్యాన్ తన అభిమాన హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో హరీష్ శంకర్, లోకేష్ కనగరాజ్ లాంటి వాళ్లు ఇప్పటికే ప్రూవ్ చేశారు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాతో బాబీ మరోసారి ఓవర్ లోడెడ్ ఫ్యాన్ స్టఫ్ ని ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.