Site icon NTV Telugu

Waheeda Rehman: సీనియర్ నటికి అరుదైన గౌరవం

waheeda rehman

waheeda rehman

Waheeda Rehman honoured with Dadasaheb Phalke award: ప్రముఖ నటి వహీదా రెహమాన్‌కు అరుదైన గౌరవం లభించనుంది. వహీదా రెహమాన్‌ను ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనున్నారు. వహీదాను దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకి ఎంపిక చేసినట్టు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం తెలిపారు. సోషల్ మీడియాలో ఒక ట్వీట్‌ను షేర్ చేస్తూ ‘వహీదా రెహమాన్ జీ భారతీయ సినిమాకు ఆమె చేసిన విశిష్టమైన కృషికి ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించబడ్డారని తెలియజేయడానికి నేను చాలా సంతోషం ఉన్నాను, గర్వపడుతున్నాను. ‘చరిత్రాత్మకమైన నారీ శక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిన తరుణంలో, వహీదాజీని ఈ జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించడం భారతీయ చలనచిత్ర ప్రముఖ మహిళలకు నిజమైన నివాళి. మన చలనచిత్ర చరిత్రలో భాగమైన ఆమె కృషికి నేను ఆమెకు అభినందనలు సవినయంగా తెలియజేస్తున్నానని రాసుకొచ్చారు.

Bigg Boss 7:నా ప్రాపర్టీ అంటావా… మళ్లీ ప్రశాంత్ పై రెచ్చిపోయిన రతిక

నిజానికి 54 ఏళ్ల ఈ అవార్డు చరిత్రలో ఇప్పటి వరకు కేవలం ఏడుగురు మహిళలకు మాత్రమే ఈ అవార్డు లభించింది. మొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును నటి దేవికా రాణికి 1969లో అందించారు. ఆ తర్వాత, రూబీ మేయర్స్ (సులోచన), కనన్ దేవి, దుర్గా ఖోటే, లతా మంగేష్కర్ సహా ఆశా భోంస్లేలను ఈ అవార్డుతో సత్కరించారు. 2020లో, ఈ అవార్డును ప్రముఖ నటి ఆశా పరేఖ్‌కు అందించారు.

వహీదా రెహ్మాన్ 1955లో తొలిసారిగా నటించింది. ఇక ఆమె 57 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 90 సినిమాల్లో నటించింది. 1955లో ‘రోజులు మారాయి’ అనే తెలుగు సినిమాతో అరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్‌లో ప్యాసా, గైడ్, కాగజ్ కే ఫూల్, చౌదవిన్ కా చంద్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్, ఖామోషి, కభీ కభీ, లమ్హే, రంగ్ దే బసంత్ మరియు ఢిల్లీ 6 వంటి సినిమాలలో నటించింది. ఇక ఇప్పటికే పద్మశ్రీ సహా పద్మభూషణ్ అవార్డులను కూడా ఆమె పొందారు.

1969లో ప్రారంభమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ సినీ పరిశ్రమలో ఇచ్చే అత్యున్నత పురస్కారం. దాదాసాహెబ్ ఫాల్కే అని ముద్దుగా పిలుచుకునే ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని పిలవబడే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే పేరు మీదుగా దీనికి పేరు పెట్టారు. దాదాసాహెబ్ 1913లో భారతదేశపు తొలి చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ని అందించారు. ఆయన గౌరవార్ధం అవార్డును 1969లో ప్రారంభించారు. ఈ అవార్డు అందుకున్న వారికి కింద ‘స్వర్ణ కమలం’, రూ.10 లక్షల నగదు, ప్రశంసాపత్రం, పట్టు ఫలకం, శాలువాతో సత్కరిస్తారు.

Exit mobile version