NTV Telugu Site icon

AP Floods : ఏపీ వరదలు.. సీఎం రిలీఫ్ ఫండ్ కు వైజయంతీ మూవీస్ భారీ విరాళం

Vyjayanthi

Vyjayanthi

ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఒకపక్క భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. మరోపక్క భారీ వరదలు ఏపీలోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ క్రమంలో వైజయంతి మూవీస్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25,00,000/- విరాళంగా అందజేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము అంటూ ప్రకటించింది. ఈ రాష్ట్రం మాకు చాలా ఇచ్చింది, ఈ చాలెంజింగ్ టైంలో తిరిగి ఇవ్వడం మా బాధ్యత అని మేము భావిస్తున్నాము. ఈ పని చేస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు పట్ల ప్రేమ, గౌరవం ఉందని మేము చెప్పాలనుకుంటున్నాము.

Also Read: OG: ఓజీ కోసం రంగంలోకి మరో స్టార్ హీరో

ఒకరికొకరు మద్దతుగా ఐక్యంగా నిలబడతామని ఈ సంధర్బంగా పేర్కొంది. కల్కి సినిమాలోని రేపటి కోసం అంటూ వాడే డైలాగ్ ఇక్కడ కూడా వాడడం గమనార్హం. ఇక ఏపీలో వరదలకు ఇప్పటి వరకు 15 మంది మృతి చెందారు. ముగ్గురు గల్లంతు కాగా 20 జిల్లాల్లో భారీగా పంట నష్టం ఏర్పడింది. 3,79,115 ఎకరాల్లో వ్యవసాయ పంట నష్టం జరగ్గా 34 వేల ఎకరాల్లో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. ఇక 1067.57 కిలో మీటర్లు మేర రోడ్లు దెబ్బతిన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: AP and Telangana Rains LIVE UPDATES: వరుణుడి ప్రతాపం.. రేపు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తీవ్ర నష్టాన్నే మిగిల్చాయి.. ఇంకా వర్షం ముప్పు పొంచిఉండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది.. అయితే, రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ప్రాణ నష్టం.. పంట నష్టం.. ఇతర విషయాలపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ఓ ప్రకటన విడుదల చేసింది.. రాష్ట్రంలో ఇంతవరకు వర్షాలు, వరదల కారణంగా 19 మంది మృతిచెందారు.. ఇద్దరు గల్లంతు అయినట్టు పేర్కొంది.. ఇక, 136 పశువులు, 59,700 కోళ్లు మరణించాయని.. 134 పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 6 వేల పశువులకు వ్యాక్సిన్ అందించడం జరిగిందని వెల్లడించింది.

Show comments