VS11: అసలైన ఎన్టీఆర్ అభిమానివి అంటే.. నువ్వే బాసూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VS11: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే ధమ్కీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ కు నిరాశే ఎదురయ్యింది. మిక్స్డ్ టాక్ అందుకున్న ధమ్కీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇక ఈసారి ఎలాగైనా హిట్ కొట్టడానికి సిద్దమైపోయాడు విశ్వక్. ఈ నేపథ్యంలోనే లిరిసిస్ట్ కృష్ణ చైతన్య ను దర్శకుడిగా పరిచయం చేస్తూ విశ్వక్ నటిస్తున్న చిత్రం VS11. సితార ఎంటర్ టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ- సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పురస్కరించుకొని విశ్వక్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Vijaya Shanthi: రాములమ్మకు క్షమాపణ చెప్పిన ఎన్టీఆర్.. ఇంటికి వెళ్లి మరీ
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
విశ్వక్ సేన్.. ఊర మాస్ లుక్ లో అదరగొట్టేశాడు. ఎన్టీఆర్ బొమ్మతో జోహార్ ఎన్టీఆర్.. తెలుగోడి ఆత్మ గౌరవం అని రాసి ఉన్న గోడకు ఆనుకొని సిగరెట్ కలుస్తూ.. షర్ట్ మడతపెడుతూ కనిపించాడు. విశ్వక్.. ఇప్పటివరకు ఇలాంటి లుక్ లో కనిపించిందే లేదు. లుంగీ, షర్ట్, సిగరెట్.. హెయిర్ స్టైల్ చూస్తుంటే.. ఈ కథ మొత్తం పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ అంటే విశ్వక్ కు ఎంత ప్రాణమో చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ గురించి కానీ, ఎన్టీఆర్ గురించి కానీ.. విశ్వక్ మాట్లాడం మొదలుపెడితే మైక్ లు బద్దలు కావాల్సిందే. ఇక ఆయన శతజయంతి వేడుకలను పురస్కరించుకొని ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం అంటే ఆయన ఎంత పెద్ద అభిమానినో తెలుస్తోంది. ఏ చిత్రంలో ఎన్టీఆర్ ఫ్యాన్ గా విశ్వక్ నటించనున్నట్లు సమాచారం. “అంతిమ కీర్తిని సాధించాలని నిశ్చయించుకున్న మనిషిని ఏదీ ఆపదు” అంటూ విశ్వక్.. ఈ పోస్టర్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో విశ్వక్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Nothing can stop a man determined to achieve ultimate glory! ✨ #VS11RagsLook🔥🔥
Remembering the Legend Shri. Nandamuri Taraka Ramarao garu, on his 100th Birth Anniversary! #JoharNTR
@thisisysr #KrishnaChaitanya @NavinNooli @manithkumar @vamsi84 #SaiSoujanya… pic.twitter.com/dt1n0ezYJi— VishwakSen (@VishwakSenActor) May 28, 2023
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!