NTV Telugu Site icon

Aishwarya Ragupathi: ధనుష్ ఈవెంట్ లో నటి ప్రైవేట్ పార్ట్ తాకిన పోకిరి.. వీడియో వైరల్

Vj

Vj

Aishwarya Ragupathi: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక మోహన్ జంటగా అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా సంక్రాంతికి బరిలో దిగుతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగాన్ని షురూ చేసిన మేకర్స్ కెప్టెన్ మిల్లర్ ఆడియో లాంచ్ ను ఘనంగా ఏర్పాటు చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. ధనుష్‌ అభిమానుల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఈవెంట్ లో నటికి చేదు అనుభవం ఎదురైంది. విజేగా కెరీర్ మొదలుపెట్టి.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఐశ్యర్య రఘపతి.. కెప్టెన్ మిల్లర్ లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ ఈవెంట్ కు ఆమె కూడా విచ్చేసింది.
ఈవెంట్ ను ముగిసాకా.. ఆమె జనాలతో పాటు బయటికి వెళ్ళడానికి ప్రయత్నించింది.

ఇక భారీ ఎత్తున ఉన్న అభిమానుల మధ్య ఒక పోకిరి.. నటి ప్రైవేట్ పార్ట్ ను తాకాడు. వెంటనే అది గమనించిన ఐశ్వర్య.. అతడిని పట్టుకొని తిడుతూ కొట్టడం మొదలుపెట్టింది. ఇక ఆ పోకిరి అక్కడనుంచి పారిపోవడానికి ప్రయత్నించగా.. చుట్టూ ఉన్నవారు కూడా ఆమెకు సపోర్ట్ గా నిలిచి పోకిరిని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ విషయాన్నీ ఐశ్వర్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చింది. ” ఆ జనం మధ్యలో ఒక పోకిరి నన్ను వేధించాడు. నేను అతని చూసాను.. వెంటనే పారిపోకుండా పట్టుకొని చితక్కొట్టాను. అతను పారిపోయాడు. కానీ, నేను ఛేజ్ చేశాను. అతను నా చేతిని విదిలించుకుని పారిపోయాడు. ఇంతమందిలో ఒక మహిళ ప్రైవేట్ పార్ట్ ను తాకే దైర్యం ఉందని నేను అనుకోలేదు. నేను అతనిపై అరుస్తూ దాడి చేసాను.నా చుట్టూ మంచి వ్యక్తులు ఉన్నారు. ప్రపంచంలో చాలా మంది దయగల మరియు గౌరవప్రదమైన వ్యక్తులు ఉన్నారని నాకు తెలుసు. కానీ ఈ కొద్ది శాతం రాక్షసుల చుట్టూ ఉండడానికి నేను చాలా భయపడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

Show comments