NTV Telugu Site icon

Waltair Veerayya: వాల్తేరు వీరయ్యకి పోలీసులు షాక్.. ఎక్కడైనా వాలిపోతామంటున్న మెగాఫ్యాన్స్

Waltair Veerayya Shocks

Waltair Veerayya Shocks

Vizag Police Gives Shock To Waltair Veerayya Over Pre Release Event: వాల్తేరు వీరయ్య సినిమాకు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ప్రీ-రివీజ్ ఈవెంట్ విషయమై పోలీసుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. తొలుత ఈవెంట్‌ని ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించాలని భావిస్తే, అక్కడ కుదరదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో.. ఆర్కే బీచ్‌లో ప్లాన్ చేశారు. అక్కడ ఏర్పాట్లు కూడా మొదలుపెట్టేశారు. ఇంతలోనే పోలీసుల యూనిట్ వర్గాలకు మరో ఝలక్ తగిలింది. ఆర్కే బీచ్‌లో ఈవెంట్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లోనే ఈవెంట్ పెట్టుకోవాలని పోలీస్ కమిషనర్ చెప్పారు. దీంతో.. ఉన్నపళంగా ఆర్కే బీచ్‌లో పనులు ఆపేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఏర్పాట్ల సామాగ్రిని కాలేజ్ గ్రౌండ్స్‌కి తరలించారు.

Sreemukhi: ఇది దారుణం.. తండ్రితోనే శ్రీముఖి పెళ్లి?

తొలుత ఆర్కే బీచ్‌లో ఈవెంట్ ఉంటుందని.. మెగాభిమానులు అక్కడికి భారీస్థాయిలో తరలివెళ్లారు. అయితే.. ఇప్పుడు అక్కడ అనుమతి నిరాకరించి, కాలేజ్ గ్రౌండ్స్‌లో పర్మిషన్ ఇవ్వడంతో, తమవంతు సహాయం అందించడానికి ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. వైజాగ్‌లో ఏ మూలలో ఈవెంట్ నిర్వహించినా.. తాము అక్కడికి వాలిపోతామని అంటున్నారు. అవసరమైతే వాలంటీర్‌గా ఈవెంట్‌కు సహాయం కూడా చేస్తామని ముందుకు వచ్చారు. కాగా.. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించారు. శృతిహాసన్ కథానాయికగా నటించగా, కేథరిన్ తెరిసా కూడా ఓ కీలక పాత్రలో మెసిరింది. ఇంకా మరెందరో ప్రముఖ నటీనటులు నటించిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

ROBO Lawyer: తొలిసారి కోర్టులో వాదించనున్న రోబో లాయర్