సలార్ టీజర్ సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టించింది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే 84 మిలియన్ వ్యూస్ తో పాత రికార్డులని సమాధి చేస్తూ కొత్త చరిత్రకి పునాది వేసింది. ఓవరాల్ గా అత్యధిక వ్యూస్ రాబట్టిన టీజర్ గా రికార్డ్ సృష్టించిన సలార్ సీజ్ ఫైర్ టీజర్ సినిమాపై అంచనాలని భారీగా పెంచేసింది. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కలిసి సెప్టెంబర్ 28న చెయ్యబోయే విధ్వంసానికి ఒక శాంపిల్ గా బయటకి వచ్చిన టీజర్ నార్త్ సౌత్ అనే తేడా లేకుండా హవోక్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 28న ఎన్ని ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయో అని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వేస్తున్నారు. ప్రభాస్ ఫేస్ కూడా రివీల్ చేయకుండా డైనోసర్ అనే ఒక్క పదంతో ప్రభాస్ కి ఎలివేషన్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని చూపించడానికి సిద్ధమయ్యాడు. ఇలాంటి సమయంలో ప్రభాస్ కి పోటీగా నిలబడడానికి ఒక పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాబోతుంది.
సెప్టెంబర్ 28నే కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో హిట్ కొట్టిన వివేక్ అగ్నిహోత్రి, తన లేటెస్ట్ మూవీ వ్యాక్సిన్ వార్ ని కూడా రిలీజ్ చెయ్యబోతున్నాడు. వ్యాక్సిన్ వార్ సినిమాపై నార్త్ లో మంచి అంచనాలే ఉన్నాయి, హిట్ అయ్యే అవకాశం కూడా ఉంది కానీ సలార్ సినిమాకు ఎదురుగా నిలబడడం అనేది కష్టమైన పని. ఈ విషయం అగ్నిహోత్రికి కూడా తెలుసు కానీ రిలీజ్ చెయ్యడానికి అవసరమైన ధైర్యాన్ని ‘కాశ్మీర్ ఫైల్స్’ ఇచ్చింది. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా, రాధే శ్యామ్ కి పోటీగా రిలీజ్ అయ్యింది. రాధే శ్యామ్ ఫ్లాప్ అయ్యింది, కాశ్మీర్ ఫైల్స్ సూపర్ హిట్ అయ్యింది. ఈ ధైర్యంతోనే వివేక్ అగ్నిహోత్రి ‘వ్యాక్సిన్ వార్’ సినిమాని మరోసారి క్లాష్ కి దించుతున్నాడు. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇస్తూ వివేక్ అగ్నిహోత్రి వీడియో కూడా రిలీజ్ చేసాడు. అయితే వివేక్ అగ్నిహోత్రికి తెలియాల్సిన విషయం ఏంటంటే అప్పుడు వచ్చింది లవర్ బాయ్ శ్యామ్… ఇప్పుడు రాబోతుంది డైనోసర్ లాంటి సలార్… కాస్త చూసుకొని క్లాష్ కి వస్తే బాగుంటుంది. తేడా కొడితే మాత్రం సలార్ ముందు వ్యాక్సిన్ వార్ డిపాజిట్స్ కూడా దొరకవు. సో సలార్ కి పోటీ అనే ఆలోచన చెయ్యకపోవడం వ్యాక్సిన్ వార్ సినిమాకి, వివేక్ అగ్నిహోత్రికి చాలా మంచిది.
