Site icon NTV Telugu

Vivek Agnihotri: ‘ద కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ సంచలన కామెంట్స్.. ప్రభాస్‌ని ఉద్దేశించేనా?

Vivek Agnihotri

Vivek Agnihotri

Vivek Agnihotri Sensational Tweet On Prabhas: కొందరు దర్శకులకు అదేం పైత్యమో తెలీదు కానీ.. ఒక హిట్ కొట్టగానే, తమని తాము తోపు – తురుములని భావిస్తుంటారు. ఇక ఎవరి మీదైనా నోరు పారేసుకోవచ్చని, ఆ హక్కు తమకు ఉందని అన్నట్టు తెగ బిల్డప్పులు ఇస్తుంటారు. ఇలాంటి దర్శకుల జాబితాలో బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్ని ప్రథమ స్థానంలో ఉంటాడని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ‘ద కశ్మీర్ ఫైల్స్’తో ఇతడు బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టినప్పటి నుంచి.. తన ప్రతిభకు కాకుండా నోటికి బాగా పని చెప్తున్నాడు. అసలు తనకు సంబంధం లేని వ్యవహారాల్లో కూడా తలదార్చుతూ.. సరికొత్త వివాదాలకు తెరలేపుతున్నాడు. బహుశా తరచూ వార్తల్లోకెక్కాలనే మోజో, లేక కశ్మీర్ ఫైల్స్ హిట్ తెచ్చిపెట్టిన మదమో తెలీదు కానీ.. ఈమధ్య అతను నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు.

Kiccha Sudeep: సుదీప్ రివర్స్ ఎటాక్.. ఆ నిర్మాతలపై పరువునష్టం కేసు

ఇప్పుడు లేటెస్ట్‌గా వివేక్ అగ్నిహోత్రి ట్విటర్ మాధ్యమంగా పరోక్షంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై షాకింగ్ కామెంట్లు చేశాడు. ప్రభాస్‌కి యాక్టింగ్ రాదని, అతడ్ని బిగ్గెస్ట్ స్టార్‌గా వర్ణించడం మరింత విడ్డూరమంటూ ఇండైరెక్ట్‌గా పేర్కొన్నాడు. ‘‘ప్రస్తుత కాలంలో సినిమాల్లో మితిమీరిన హింసను గ్లామరైజ్ చేయడం, ఎలాంటి సెన్స్ లేని సినిమాలను ప్రమోట్ చేయడాన్ని బిగ్గర్ ట్యాలెంట్‌గా చెప్పుకుంటున్నారు. అసలు నటనే రాని నటుల్ని బిగ్గెస్ట్ స్టార్లుగా చెప్పుకోవడం కూడా పెద్ద ట్యాలెంట్‌గా భావిస్తున్నారు. ఇక ప్రేక్షకుల్ని పిచ్చోళ్లని అనుకోవడం అంతకుమించిన ట్యాలెంట్‌ అనుకుంటున్నారు’’ అంటూ వివేక్ ట్వీట్ చేశాడు. అతడు ఇతర సమయాల్లో ఈ ట్వీట్ చేసి ఉంటే, ఇంత చర్చ జరిగేది కాదేమో. కానీ.. సరిగ్గా సలార్ టీజర్ రిలీజ్ అయిన మూడు గంటలకే ఈ ట్వీట్ చేయడంతో.. ఇది సలార్ సినిమాను, అలాగే ప్రభాస్‌ను ఉద్దేశించి చేసిన ట్వీటేనని చెప్పుకుంటున్నారు.

VD13: విజయ్ VD13 నుంచి క్రేజీ అప్డేట్.. నెక్ట్స్ అక్కడే!

అలాంటప్పుడు ప్రభాస్ అభిమానులు ఊరికే ఉంటారా? వివేక్‌పై తాను చేసిన ట్వీట్ కిందే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘హేట్ స్టోరీ’లాంటి బీ గ్రేడ్ సినిమా తీసిన నువ్వు కూడా.. నటుల ట్యాలెంట్ గురించి మాట్లాడటం, వయోలెన్స్‌పై లెక్చరర్ ఇవ్వడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందంటూ కౌంటర్లు వేస్తున్నారు. ‘నీ గొప్పతనం గురించి చెప్పుకోవడం కోసం ఇతరుల ట్యాలెంట్‌ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే.. అది నీ పతనానికి దారితీస్తుంది’ అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. ‘‘ద కశ్మీర్ ఫైల్స్ సినిమా తీసి.. నువ్వు మతాల మధ్య చిచ్చు పెట్టలేదా?’’ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

Vivek Tweet

Exit mobile version